చీజీ బ్రింజాల్స్లైస్
పెద్ద వంకాయను శుభ్రంగా కడిగి పొడవుగా, మరీ పల్చగా కాకుండా కాస్త మందపాటి ముక్కలుగా తరుక్కోవాలి. టమాటాను కూడా గుండ్రంగా అంత పల్చటి ముక్కలు కాకుండా తరిగి ఉంచుకోవాలి. చీజ్‌ను తురిమి పక్కకు పెట్టుకోవాలి.
కావసిన పదార్థాలు
పెద్ద వంకాయ: ఒకటి
టమాటాలు: రెండు
చీజ్ క్యూబ్‌లు: రెండు
నూనె: టేబుల్ స్పూను
ధనియాల పొడి: అరస్పూను
జీరా పొడి: అరస్పూను
ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
పెద్ద వంకాయను శుభ్రంగా కడిగి పొడవుగా, మరీ పల్చగా కాకుండా కాస్త మందపాటి ముక్కలుగా తరుక్కోవాలి. టమాటాను కూడా గుండ్రంగా అంత పల్చటి ముక్కలు కాకుండా తరిగి ఉంచుకోవాలి. చీజ్‌ను తురిమి పక్కకు పెట్టుకోవాలి. వంకాయ ముక్కల్ని తీసుకుని వాటి మధ్యలో చాకుతో ఇంటూ మార్కులాగా కోయాలి. తర్వాత ఆ ముక్కలకు ఉప్పు రాసి, రెండు వైపులా నూనె పూసి పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి. టమాటాను కూడా ఒక ఇరవై సెకండ్ల పాటు రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల మీద టమాటా ముక్కలు ఉంచి, వాటి మీద ధనియా, జీరా పొడులను చల్లాలి. చీజ్ తురుమును కూడా వేయాలి. ఇప్పుడు ఈ మొత్తం ముక్కను పెనం మీద పెట్టి చీజ్ కొద్దిగా కరిగిందాకా వేడిచేయాలి. అంతే, రుచిగా స్నాక్‌లా తినేందుకు ఇండియన్ ట్విస్ట్‌తో, చీజీ ఎగ్‌ప్లాంట్ టమాటా ైస్లెస్లు సిద్ధమైపోతాయి.
– ఎం.బాలరాయుడు, పాకశాస్త్ర నిపుణురాలు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- brinjal
- Cheesy
- Indian twist
- Slices
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

