సాగునీటి సంబురం
పిల్ల కాలువలన్ని తల్లి కాలువలు అయ్యాయి. చెరువులు, కుంటలు... జలాశయాలయ్యాయి. జలకళను సంతరించుకున్న తెలంగాణ కొత్త జిల్లాల పచ్చని పొలాలు నేలకు ఆకుపచ్చ చీర చదివించాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తదుపరి తెలంగాణ పల్లెల్లో వ్యవసాయిక విప్లవం ఆరంభమైంది.
పిల్ల కాలువలన్ని తల్లి కాలువలు అయ్యాయి. చెరువులు, కుంటలు… జలాశయాలయ్యాయి. జలకళను సంతరించుకున్న తెలంగాణ కొత్త జిల్లాల పచ్చని పొలాలు నేలకు ఆకుపచ్చ చీర చదివించాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తదుపరి తెలంగాణ పల్లెల్లో వ్యవసాయిక విప్లవం ఆరంభమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం స్థూలంగా నీటి వినియోగంపై దృష్టి సారిస్తే, స్థానికంగా ఉన్న నీటి వనరులను వినియోగించుకునేందుకు జిల్లా స్థాయిల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి మొదలైంది.
దీంతో క్రమంగా నీటి పారుదల సౌకర్యాలు మెరుగవడంతో పాటు, పంట విస్తీర్ణం పెరిగింది. అలాగే పంట ఉత్పత్తి, ఉత్పాదకత రెండు పెరిగాయి. 2015-16 నాటికి తెలంగాణ రాష్ట్రంలో సాగుభూమి 1,08,13,641 ఎకరాలు. ఇందులో 23,19,969 ఎకరాలు ఏటా రెండు పంటలు పండే భూములుగా గుర్తించారు. రాష్ట్ర స్థాయిలో 2015-2016 ఆర్థిక సంవత్సరంలో 14,15,420 ఎకరాల్లో వరి సాగైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 45,44,982 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయింది.

Canal
బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగంలో తీసుకొచ్చిన మార్పులతో సేద్యం పరుగులు పెట్టింది. ఎనిమిది తొమ్మిందేండ్ల వ్యవధిలో కొత్త జిల్లాల పరిధిలో సాగునీటి రంగంలో జరిగిన కృషి ఫలితంగా ఫలితాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 2023లో వానాకాలంలో 65,95,116 ఎకరాల్లో వరి సాగు కాగా, 1,46,46,591 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఇక రబీ సీజన్లో 52,15,876 లక్షల ఎకరాల్లో వరి వేయగా, 1,14,41,536 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయింది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు 2016లో రాష్ట్రంలో మొత్తంగా (ఖరీఫ్, రబీ కలిపి) 45,18,519 ఎకరాల్లో వరి పండించారు. 98,98,243 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2023-24లో 1,18,10,992 ఎకరాల పంట నుంచి 2,60,88,127 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఏండ్ల కాలంలోనే పంట సాగు విస్తీర్ణంతో పాటు, దిగుబడి సామర్థ్యం రెండూ 150 శాతానికి పైగా పెరిగాయి. కొత్త జిల్లాలు వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతికి ఈ లెక్కలే నిదర్శనం.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

