పెద్దబిడ్డె పెండ్లిల నాగెల్లి పూజ చెయ్యాలె
ఈ పదబంధంలోని ‘నాగెల్లి’ అనే ఓ పురాతన తంతుకు సంబంధించింది. మన తెలంగాణ సంప్రదాయంలో పూర్వం ఐదు రోజుల పెండ్లి జరిగేది. ఆ కార్యక్రమంలో ఓ తంతు నాగెల్లి/ నాగవెల్లి/ నాకబలి/ నాగపెండ్లి/ నాగవెండ్లి/ నాగవల్లి. ప్రాంతాలనుబట్టి వేరువేరుగా పలుకుతుంటారు.
ఈ పదబంధంలోని ‘నాగెల్లి’ అనే ఓ పురాతన తంతుకు సంబంధించింది. మన తెలంగాణ సంప్రదాయంలో పూర్వం ఐదు రోజుల పెండ్లి జరిగేది. ఆ కార్యక్రమంలో ఓ తంతు నాగెల్లి/ నాగవెల్లి/ నాకబలి/ నాగపెండ్లి/ నాగవెండ్లి/ నాగవల్లి. ప్రాంతాలనుబట్టి వేరువేరుగా పలుకుతుంటారు. సంస్కృతంలో నాకం అంటే స్వర్గం. బలి అంటే నైవేద్యం. అంటే.. స్వర్గంలోని దేవతలకు నైవేద్యం పెట్టడం. వధూవరుల పెండ్లికి ముందురోజు ఇంద్రుని భార్య అయిన శచీదేవిని పూజించి.. పెండ్లి తర్వాత ‘నాకబలి’ పూజ చేస్తారు. స్వర్గాధిపతి ఇంద్రుడితోపాటు అతని పరివారం మొత్తానికి ఈ పూజ చేయడం వల్ల నూతన వధూవరులకు మంచి జరుగుతుందని నమ్మకం. నాగవెల్లి పూజల్లో పోలుముంతలు, చీరెతో ఆలంకరించిన చెక్కబొమ్మలు, గరిగబుడ్డి, గోధుమ దీపాలు, కుడుక, ముల్లుకర్ర/ తరాజు వంటి కుల వృత్తికి సంబంధించిన వస్తువులు ముఖ్యమైనవి. ఇప్పుడు అంత సమయం లేకపోగా.. ఒక్కపూటలోనే పెండ్లి తంతు ముగిస్తున్నారు. నాగెల్లికి నామం పెడుతున్నారు.
బొమ్మలు: మృత్యుంజయ్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

