స్కిన్ బ్యాంక్ అంటే ఏమిటో మీకు తెలుసా?

‘స్కిన్ బ్యాంక్’ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతున్నది.దేశం మొత్తం మీద పదికంటే ఎక్కువ చర్మబ్యాంకులు లేవు.తాజాగా ఉస్మానియా హాస్పిటల్లోనూ ఏర్పాటు చేశారు.ఇంతకూ, ‘స్కిన్ బ్యాంక్’ అంటే ఏమిటి? ఎక్కడ ఉంటుంది?స్కిన్ డొనేషన్ ఎందుకు, ఎక్కడ చేయాలి?
పూర్వం నుంచీ అన్నదానం మహాదానమే. మారిన పరిస్థితులవల్ల రక్తదానం కూడా గొప్పదానమే అయ్యింది. తర్వాత నేత్రదానం ఆ జాబితాలో చేరింది. వైద్యవిధానంలో విప్లవాత్మక మార్పులతో ‘ట్రాన్స్‌ప్లాంటేషన్’ అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో అవయవదానం గురించి అవగాహన కల్పిస్తున్నారు ఎంతోమంది స్వచ్ఛంద సేవకులు. ఆరోగ్యవంతమైన కిడ్నీ, లివర్, గుండె సేకరిస్తున్నట్టే, చర్మాన్నికూడా భవిష్యత్ అవసరాలకోసం భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు.భారతదేశంలో ప్రతి సంవత్సరం పది లక్షలకు పైగా కాలిన గాయాల కేసులు నమోదవుతున్నాయి. వాటిలో చాలావరకు అదనపు కవచం అవసరమున్నవే. ఏ అగ్ని ప్రమాదంలోనో ఎక్కువ శాతం చర్మాన్ని నష్టపోయి ఉంటే, రోగి శరీరంలో ఒకచోట ఉన్న చర్మాన్ని తీసి, మరొక చోట అంటు కట్టి కొంతవరకు సమస్యకు పరిష్కారం చూపవచ్చు. ఈ పద్ధతిని ‘ఆటోగ్రాఫ్ట్’ అంటారు. అందరికీ ఆటోగ్రాఫ్టింగే పరిష్కారం కాదు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రత్యామ్నాయ చర్మమూ అవసరమవుతుంది.
ప్రాణాంతక పరిస్థితుల్లో
శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మం. కొన్ని సందర్భాల్లో కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలు 60 శాతం డ్యామేజీ అయినా మనిషి బతుకుతాడు. కానీ, చర్మానికి అంత తీవ్రస్థాయిలో నష్టం జరిగితే తట్టుకోలేడు. 40 శాతం కన్నా ఎక్కువ నష్టం జరిగితే బతకడం కష్టమే. ఆ సమయంలో స్కిన్ గ్రాఫ్టింగ్ విధానం సాయపడుతుంది. అయితే, సాధారణ స్కిన్ గ్రాఫ్టింగ్ అన్నిసార్ల్లూ సత్ఫలితాలను ఇస్తుందనే గ్యారెంటీ లేదు. ఇంటెగ్రా పద్ధతిద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు కానీ, ఇది ఖర్చుతో కూడుకున్నది. కాడెరిక్ స్కిన్ గ్రాఫ్టింగ్ పద్ధతి కొంతవరకు ఉత్తమం. స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాలన్నా కూడా ప్రత్యామ్నాయ చర్మం అవసరమే. మరి, అది ఎక్కడ దొరుకుతుంది? ఎవరిస్తారు? అత్యవసర పరిస్థితుల్లో స్కిన్బ్యాంక్స్ ఒక్కటే పరిష్కారం.

రక్తం అవసరమైతే బ్లడ్ బ్యాంక్‌లో సేకరించినట్టు చర్మాన్నికూడా అలానే సమీకరించుకొనే విధానమే ‘స్కిన్ బ్యాంక్’ వ్యవస్థ. అగ్ని ప్రమాదాల్లో చర్మం కాలిపోయిన వారికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే రోజూ డ్రెస్సింగ్ చేయాలి. ఆ సమయంలో రోగి నరకయాతన అనుభవిస్తారు. అదే గ్రాఫ్టింగ్ పద్ధతిని అవలంబిస్తే రోజూ డ్రెస్సింగ్ అవసరం ఉండదు. మూడు నెలల వరకూ అసలు డ్రెస్సింగ్‌తోనే పన్లేదు. గ్రాఫ్టింగ్ కోసం స్కిన్ కావాలంటే స్కిన్‌బ్యాంక్ మీద ఆధారపడాలి. చర్మదాత మరణించిన ఆరు గంటలలోపే చర్మాన్ని తీసుకొని, గ్లిజరాల్లో నిల్వ ఉంచి, స్కిన్బ్యాంక్కు తీసుకెళ్లి శీతలీకరణ విధానంలో భద్రపరుస్తారు.
ఉస్మానియాలో
అగ్ని ప్రమాదాల్ని పేదల యాక్సిడెంట్స్‌గా అభివర్ణిస్తారు. కారణం, కార్ఖానల్లో విస్ఫోటనాలు సంభవిస్తే గాయాల పాలయ్యేది పేద కార్మికుడే. సామాన్య మహిళకు జీవితం మీద విరక్తి వచ్చినా, ఏ అత్తగారికో కోడలిమీద కసి పెరిగినా గుర్తుకొచ్చేది నిప్పే! కానీ, ఓమోస్తరు ఆగ్ని ప్రమాదాలైనా, విఫల ఆత్మహత్యా ప్రయాత్నాలైనా.. సజీవి అయిన రోగికి నరకమే. పేదరికం వల్ల డ్రెస్సింగ్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు చాలామంది. ఈ కారణంగా ప్రత్యామ్నాయ చర్మం అవసరమవుతుంది. ఆ కొరతను స్కిన్ బ్యాంక్‌లు మాత్రమే తీరుస్తాయి. చర్మదానంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రోటరీ క్లబ్ పూనుకుంది. ఇండియాలోని తొమ్మిది స్కిన్బ్యాంక్ల నమూనాలోనే హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్లో ఈమధ్యే ‘స్కిన్ బ్యాంక్’ను ఏర్పాటు చేసింది. దీనివల్ల నిరుపేదలకు ఎంతో ఎంతో ప్రయోజనం. అగ్ని ప్రమాద బాధితులకూ గొప్ప ఊరట లభిస్తుంది.

ఐదేండ్ల వరకు నిల్వ
‘స్కిన్ బ్యాంకింగ్’ అనేది మృతుల నుంచి అంతర్జాతీయ ప్రొటొకాల్స్ ప్రకారం చర్మాన్ని సేకరించే ఒక ప్రాసెస్. చర్మాన్ని 4-8 డిగ్రీల సెల్సియస్వద్ద ఐదు సంవత్సరాల వరకు స్కిన్ బ్యాంక్‌లో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసిన చర్మాన్ని కాలిన రోగులకు, ఆర్థోపెడిక్ ట్రామా రోగులకు, తీవ్ర చర్మరోగాలకు ఉపయోగిస్తారు. ముందుగా దివంగతుడైన దాత శరీరం నుంచి రక్తనమూనా సేకరిస్తారు. ఎయిడ్స్, హెపటైటిస్, చర్మ క్యాన్సర్లతో బాధ పడుతున్నట్లు నిర్ధారణ అయితే చర్మదానం స్వీకరించరు. పరిపూర్ణ ఆరోగ్యవంతుల నుంచీ కాళ్లు, తొడలు, వెనకభాగం నుంచి చర్మాన్ని సేకరిస్తారు. అదీ చర్మంపై ఉన్న సన్నని పొరను మాత్రమే తీస్తారు.

Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

