కిస్.. శ్రీలీల కిస్మత్ మార్చింది!
కన్నడ కోమలి శ్రీలీల ‘పెళ్లిసందD’తో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు కొట్టేసింది. గ్లామర్ గ్రామర్ తెలిసిన హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాననీ, యాక్టింగ్ చేస్తూనే.. డాక్టర్ అనిపించుకుంటాననీ శపథాలు చేస్తున్నది వాలుకండ్ల లీల..
కన్నడ కోమలి శ్రీలీల ‘పెళ్లిసందD’తో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు కొట్టేసింది. గ్లామర్ గ్రామర్ తెలిసిన హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాననీ, యాక్టింగ్ చేస్తూనే.. డాక్టర్ అనిపించుకుంటాననీ శపథాలు చేస్తున్నది వాలుకండ్ల లీల..
మూడేండ్ల వయసులోనే భరతనాట్యం నేర్చుకున్నా. అరగేంట్రం ఎనిమిదో ఏట జరిగింది. అప్పటినుంచి నృత్యం నా దినచర్యలో భాగమైంది. కర్ణాటక, ఆంధ్ర రాష్ర్టాల్లో చాలా దేవాలయాల్లో ప్రదర్శనలిచ్చాను. భరతనాట్యం నేర్చుకోవడం వల్ల కండ్లతో, ముఖ కవళికలతో హావభావాలు పలికించడం సులభం అవుతున్నది.
అమ్మ కష్టంతోనే చదువుకున్నా. అమ్మ ప్రోత్సాహంతోనే చదువు, సినిమాలు బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. నాకు స్నేహితులు తక్కువే. అమ్మతోనే అన్ని విషయాలూ పంచుకుంటా. అమ్మే నా బెస్ట్‌ఫ్రెండ్. అమ్మ నన్ను పెంచేందుకు పడిన కష్టాలు ఇంకా గుర్తున్నాయి. ఆ ఇబ్బంది మరొకరికి తెలియకూడదనే.. నా వంతుగా ఇద్దరు అనాథల్ని దత్తత తీసుకున్నా. ఆ చిన్నారులు పంచే ప్రేమ వెలకట్టలేనిది.
చిన్నప్పటి నుంచీ డ్యాన్స్, మిమిక్రీ అంటే ఆసక్తి. సినిమాల్లోకి రావడం మాత్రం యాదృచ్ఛికమే. చదువుల్లో మునిగితేలుతున్న నాకు ‘కిస్'(కన్నడ)లో తొలి అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. అప్పటినుంచీ చదువుతోపాటు నటనా నా జీవితంలో భాగమైంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నా. మెడిసిన్ పూర్తిచేసి డాక్టర్ అనిపించుకుంటాను. అలా అని, సినిమాలనూ వదిలిపెట్టను.
ఎన్ని శీతల పానీయాలు ఉన్నా, నాకు నిమ్మరసం అంటేనే ఇష్టం. ప్రేమ అనేది పెండ్లితోనే సంపూర్ణం అవుతుంది. ఇప్పటికిప్పుడు పెండ్లి ఆలోచన లేదు కానీ, నన్ను చేసుకునే వాడికి సహనం ఉండాలి. అర్థం చేసుకునే గుణం ఉండాలి. నవ్వుతూ నవ్విస్తూ నన్ను మహారాణిలా చూసుకోవాలి.
అభిమాన నటుల కంటే, అభిమాన పాత్రలే ఎక్కువ. బలమైన చారిత్రక పాత్రలో నటించాలని ఉంది. ప్రయాణాలంటే ఇష్టం. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నా. అన్ని భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ‘ధమాకా’, ‘అనగనగా ఒక రాజు’ నిర్మాణ దశలో ఉన్నాయి.
మణిరత్నం, రాజమౌళి నా అభిమాన దర్శకులు. ఇద్దరి టేకింగ్ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. నేను మరీ అంత భోజనప్రియురాలిని కాదు కానీ, మసాలా దోశ ఇష్టపడతాను. తెల్లగా మల్లెపూలలా మెరిసిపోయే వేడివేడి ఇడ్లీలు ఎన్నయినా లాగిస్తాను.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

