నిద్రపట్టాలంటే చీకటిగా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం కావాలి. అలాంటి ఏర్పాటు చేస్తుంది ‘ఆరా స్మార్ట్ స్లీప్ మాస్క్’. నలుపు రంగులో కళ్ల మీద ఎలాంటి ఒత్తిడీ పడకుండా ఉండేలా తయారు చేసిన ఇది వెలుతురును ఆపుతుంది. ఇందులో ఉండే స్పీకర్లు మనసుకు సాంత్వన కలిగించే సంగీతాన్ని వినిపిస్తాయి.
నిద్రలేమి సమస్యల్లాంటి వాటిని పోగొట్టి, మనసును ఉత్తేజ పరిచేందుకు సాయపడే లైట్ థెరపీ కూడా ఇందులో ఉంది. ఒత్తిగిల్లి పడుకున్నా ఇబ్బంది లేకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. ఒకసారి చార్జింగ్ పెడితే వారం రోజులు వాడుకోవచ్చు. aura-circle.com లో దీన్ని అమ్ముతున్నారు. ధర రూ.16,800.