డీఎస్ఎల్ఆర్ కెమెరాలా స్మార్ట్‌ఫోన్.. గుడ్లగూబ లాంటి లైట్
మర్చిపోయినవాటిని సులభంగా గుర్తించే ట్రాకర్. కేబుల్స్ లేకుండా వైర్లెస్ ద్వారా స్ట్రీమింగ్ చేసే ఈ ప్లగ్ తదితర పరికరాలను ఈ వారం నయామాల్లో అందిస్తున్నాం. మీకు నచ్చినవి కొనుక్కొని ఇతరుల కంటే స్మార్ట్‌గా ఉండండి.
నయా మాల్
మర్చిపోయినా ఫర్వాలేదు..
నిత్య జీవితంలో తాళాలు, పర్సులు, బ్యాగులను ఎక్కడైనా మర్చిపోవడం, పోగొట్టుకోవడం చాలా సాధారణ విషయం. ఇలాంటి సందర్భంలో వస్తువులను సులభంగా ట్రాక్ చేయడానికి UGREEN సంస్థ FineTrack 2 Smart Finder ట్రాకర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఆపిల్ అధికారిక ‘ఫైండ్ మై’ నెట్‌వర్క్‌తో పనిచేస్తాయి. ప్రపంచంలో ఎక్కడైనా సరే.. మీ వస్తువు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఏదైనా ఆపిల్ డివైజ్ ఉంటే చాలు, ఆ సిగ్నల్ ద్వారా మీ ట్రాకర్ లొకేషన్ మీ ఫోన్‌కు చేరుకుంటుంది. దీనివల్ల మీ వస్తువులు ఏ దేశంలో ఉన్నా.. మ్యాప్ ద్వారా వెంటనే కనుక్కోవచ్చు. ఇంట్లో, ఆఫీసులో మీ వస్తువులు కనిపించకుండా పోతే.. మీ ఫోన్ నుంచే సౌండ్ ప్లే చేయవచ్చు. సులభంగా ఆ వస్తువు ఉన్న చోటును గుర్తించవచ్చు. ఇక పర్సు లేదా బ్యాగును ఎక్కడైనా మర్చిపోయి ముందుకు వెళ్తుంటే.. వెంటనే మీ ఐఫోన్‌కు అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. ఈ ట్రాకర్ లొకేషన్‌ను మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో (గరిష్ఠంగా ఐదుగురి వరకు) షేర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల అందరూ కలిసి ఆ వస్తువు ఎక్కడ ఉందో ట్రాక్ చేయవచ్చు. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి, రోజూ వస్తువులను ఎక్కడో పెట్టి మర్చిపోయే వారికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.
– ధర: రూ.1800, దొరుకుచోటు: ugreen.com

Finetrack 2 Smart Finder
చిటికెలో పెద్ద స్క్రీన్‌పైకి..
స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలోని కంటెంట్‌ను ప్రొజెక్టర్లు, టీవీల్లో చూడాలని అనుకుంటున్నారా? ఎలాంటి కేబుల్స్ అవసరం లేకుండానే వైర్లెస్ పద్ధతిలో స్ట్రీమింగ్ కావాలా? అయితే, LLANO S9 Pro వైపు ఓ లుక్కేయాల్సిందే! ఆఫీస్ ప్రెజెంటేషన్లు, క్లాస్‌రూమ్స్, హోమ్ థియేటర్లు, గేమింగ్ అవసరాల కోసం.. ఈ ప్లగ్ అండ్ ప్లే డివైజ్ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడానికి ఎలాంటి ప్రత్యేకమైన యాప్‌లు, డ్రైవర్లు, వై-ఫై నెట్వర్క్ అవసరం లేదు. ట్రాన్స్మిటర్ను మీ ఫోన్/ల్యాప్‌టాప్‌కి, రిసీవర్‌ను ప్రొజెక్టర్ లేదా టీవీకి కనెక్ట్ చేస్తే చాలు.. ఆటోమేటిక్‌గా సిగ్నల్ కనెక్ట్ అవుతుంది. 1080p / 60Hz ఫుల్ హెచ్డీ వీడియోలను కూడా అత్యంత స్పష్టంగా అందిస్తుంది. ప్రెజెంటేషన్లు, సినిమాలు చూస్తున్న సమయంలో మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ బ్యాటరీ అయిపోకుండా ఉండేందుకు ఇది 60W పవర్ డెలివరీ సపోర్ట్ కూడా అందిస్తుంది. యూఎస్బీ-సి సపోర్ట్ ఉన్న అన్ని స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పనిచేస్తుంది.
– ధర: రూ. 13,600, దొరుకుచోటు: llanolife.com

Llano S9 Pro
మొబైల్ ఫొటోగ్రఫీకి అందలం..
మొబైల్ ఫొటోగ్రఫీని అందలం ఎక్కించేలా TELESIN సంస్థ మరో అడుగు ముందుకేసింది. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను ప్రొఫెషనల్ డీఎస్ఎల్ఆర్ కెమెరాలా మార్చేసే.. Master Grip Kit Classicను తీసుకొచ్చింది. ముఖ్యంగా, ఐఫోన్ 17/18 ప్రో, ఐఫోన్ 17/18 ప్రో మ్యాక్స్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక అడ్వాన్స్డ్ మాస్టర్ గ్రిప్ కిట్ ఇది. వైల్డ్ లైఫ్, స్పోర్ట్స్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ చేసే వారికి.. ఈ కిట్ అద్భుతమైన వరంలా పనిచేస్తుంది. ఇందులోని 105 ఎంఎం క్లాసిక్ పోర్ట్రెయిట్ లెన్స్ సహాయంతో ఎలాంటి బ్లర్ లేకుండా.. అత్యంత సహజమైన, ప్రొఫెషనల్ స్థాయి పోర్ట్రెయిట్ ఫొటోలను తీసుకోవచ్చు. ఇక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ కోసం 200 ఎంఎం ఆప్టికల్ రీచ్ లెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. చాలా దూరంలోని సబ్జెక్టులను కూడా ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా స్పష్టంగా ఫొటోలు, వీడియో తీయడానికి సహాయపడుతుంది. ఇందులోనే 3200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. షూటింగ్ చేస్తున్నంత సేపు మీ ఐఫోన్ చార్జ్ అయిపోకుండా నిరంతరం పవర్ అందిస్తుంది. ఇందులోని గ్రాఫేన్ కూలింగ్ సిస్టమ్.. ఎక్కువ సేపు 4కె లేదా 8కె వీడియోలు రికార్డ్ చేస్తున్నప్పుడు ఫోన్ వేడెక్కకుండా కాపాడుతుంది.
– ధర: రూ.17,000, దొరుకుచోటు: telesinstore.com

Master Grip Kit Classic
రాత్రిపూట గుడ్లగూబ రక్షణ
సైక్లింగ్ చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. బ్యాక్‌లైట్ లేకుంటే.. రాత్రిపూట ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే.. ‘Owl’ design rear bike lightఅమర్చుకోవాల్సిందే! ఇదో స్టయిలిష్-సేఫ్టీ యాక్సెసరీ. చూడటానికి అచ్చం రాత్రిపూట మెరిసే గుడ్లగూబ కళ్లలా కనిపిస్తుంది. మీ సైకిల్‌కు డిఫరెంట్ లుక్‌ను ఇవ్వడంతోపాటు రోడ్డుపై రాత్రి సమయంలో అద్భుతమైన విజిబిలిటీని అందిస్తుంది. ఈ లైట్ ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని బ్లూటూత్ లేదా యాప్ కనెక్షన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. అధిక నాణ్యత గల ఏబీఎస్, పీసీ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారైన ఈ లైట్.. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తగిలే షాక్‌లు, వైబ్రేషన్లను సమర్థంగా తట్టుకోగలదు. వాటర్ రెసిస్టెంట్ ఉండటం వల్ల వర్షంలో తడిసినా సురక్షితంగా ఉంటుంది.
– ధర: రూ.3,200, దొరుకుచోటు: in.dhgate.com

Owl Design Rear Bike Light
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

