కాళ్ల దగ్గరికి ప్రయాణం.. కంటికి దూరమైన గాయం
పాలకులకు మనసు ఉంటే దూరాలను చెరిపివేయగలరు. మనుషుల వ్యక్తిగత కష్టాలనే కాదు.. సామూహిక ఇబ్బందులనూ శాశ్వతంగా పరిమార్చగలరని కొత్త జిల్లాల రూపకల్పన నిరూపించింది. జిల్లాల పునర్విభజన జటిలమైన ప్రాంతపు సమస్యలకు ఫలవంతమైన పరిష్కారాలను చూపింది.
పాలకులకు మనసు ఉంటే దూరాలను చెరిపివేయగలరు. మనుషుల వ్యక్తిగత కష్టాలనే కాదు.. సామూహిక ఇబ్బందులనూ శాశ్వతంగా పరిమార్చగలరని కొత్త జిల్లాల రూపకల్పన నిరూపించింది. జిల్లాల పునర్విభజన జటిలమైన ప్రాంతపు సమస్యలకు ఫలవంతమైన పరిష్కారాలను చూపింది. చారిత్రక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే వాటి సాంస్కృతిక వైభవాన్ని మరింత ఉన్నతీకరించడంలో సాయపడ్డది. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో ఊరూరా కాలికి బలపం కట్టుకొని తిరిగిన కేసీఆర్.. భౌగోళిక వాస్తవికత మాత్రమే కాకుండా మానవసంబంధాల విలువ తెలిసినవాడు. కనుకనే దూరాలను చెరిపివేసి.. మనుషులను ఓటు సరుకులా కాకుండా మానవత్వపు లోగిళ్లుగా మార్చేందుకు కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు.
సుదూరతీరాలు క్షతగాత్ర సమీరాలతో సమానం. దశాబ్దాల జీవితానుభవం నిరూపించిన సత్యమది. దళారీకి దాసోహమైన అవసరార్థులని ఏర్పరచింది. మారుమూల ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో రోగం ముదరటం వల్ల కాదు, దూర భారం వల్ల బతికి ఉన్నవారితో పోటీపడగలిగిన స్థాయిలో ప్రాణాలు విడిచినవారూ ఉంటారంటే అతిశయోక్తి కాని కాలం దాటుకొని వచ్చింది తెలంగాణ. జిల్లాల పునర్విభజనతో ఏ వర్గానికి కలిగిన లాభం ఎంత? బుల్‌ను రియల్ ఎస్టేట్ కూలదోసిందా? భవంతులు భౌగోళిక రూపురేఖల్ని మార్చివేశాయా? ఇలాంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం కనుగొనాలంటే జిల్లాల పునర్విభజన కాకముందు జిల్లా కేంద్రంతో పనిపడిన ఓ మారు‘మూల’వాసీతో సంభాషించాల్సిందే.
భావోద్వేగానికి అసలైన నిర్వచనాన్ని పచ్చిపుండులా సలిపిన తన గ్రామం నక్షను తన దేహంతో ఆవిష్కరించి చూపిస్తాడు. బస్సు మిస్ అయిన రాత్రి రోడ్డు మీద కునికిపాట్లు తీస్తుంటే పోలీస్ జీపొచ్చి కుళ్లబొడిచిన అనుభవాన్ని వివరిస్తాడు. జేబు ఖాళీ అయితే బస్చార్జీలకు పైసల్లేక మూడు నాలుగు రోజులు నడిచి.. నడిచి ఈడ్చుకుంటూ వెళ్లిన సంగతిని గుర్తుచేస్తే ఇప్పటికీ ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే మనుషులూ కనిపిస్తారు.
పూర్వపు ఖమ్మం జిల్లా వాజేడు మండలం టేకులగూడెంవాసులను అడిగినా, పూర్వపు కరీంనగర్ జిల్లా అవిభక్త మహదేవ్పూర్ మండలంలోని పలిమెల (పలిమెల నూతన మండలం) సరిహద్దు గ్రామవాసిని అడిగినా లేదా ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలం రాజుపేటకు చెందిన వ్యక్తిని అడిగినా…. ఇలా జిల్లాల పునర్విభజనకు ముందు ఉన్న అనుభవాలు, కేసీఆర్ కొత్త జిల్లాల కూర్పుతో కలిగిన తక్షణ ప్రయాణ సౌకర్యమే కాదు ఫలవంతమైన మరిన్ని ప్రయోజనాలు ఏమిటో మెరిసే కండ్లతో చెప్తారు.
టేకులగూడెం టేకాఫ్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాజేడు మండల ప్రజలకు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వెన్నులో వణుకు పుట్టేది. 260 కిమీ ప్రయాణించి 4 బస్సులు మారి.. పోను 7 గంటలు.. రాను 7 గంటలు మొత్తం ప్రయాణానికే 14 గంటలు. అదీ సమయానికి బస్సు దొరికితేనే! లేదంటే రెండురోజుల ప్రయాణం. ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉంటుంది టేకులగూడెం.
ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ముందుగా అక్కడి నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి జగన్నాథపురం చేరుకోవాలి. తర్వాత మరో ప్రైవేట్ వెహికిల్ పట్టుకొని మరో 20 కిలోమీటర్లు ప్రయాణించి వెంకటాపూర్ చేరాలి. అక్కడి నుంచి బస్సులో 110 కిలోమీటర్లు భద్రాచలం. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి మరో 110 కిలోమీటర్లు బస్సు ప్రయాణం. ఇలా ఉదయం బయలుదేరిన వ్యక్తులు మధ్యాహ్నం 2 గంటలలోపు అక్కడికి 260 కిమీ ప్రయాణం చేసి చేరుకోవాల్సిన దుస్థితి. ఆరోగ్యపరంగానూ మెరుగైన వైద్యం కోసం ఇలా వెళ్లి రావాల్సిందే.
ఇక వానాకాలం వస్తే వాజేడు నుంచి భద్రాచలం వరకు పలుచోట్ల రహదారులు నీటమునిగి అడుగడుగునా అడ్డంకుల్ని తెచ్చిపెట్టేవి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ చేసిన సాహసోపేత చర్య జిల్లాల పునర్విభజన. ఇప్పుడు అదే టేకులగూడెం వాసి కేవలం రెండు గంటల్లో తన జిల్లా కేంద్రం ములుగుకు దర్జాగా చేరిపోతున్నాడు. పూర్వపు ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం (నూగురు) రెండు మండలాలను ములుగు జిల్లాల్లో చేర్చటం వల్ల దూరం దాదాపు సగానికి సగం తగ్గింది.
ములుగు జిల్లా కేంద్రం నుంచి టేకులగూడెం దూరం 80 కిలోమీటర్లే! రెండు గంటల ప్రయాణం. టేకులగూడెం వాసులకు విద్య, వైద్య సేవలు అవసరమైనా, జిల్లా అధికారులతో పని ఉన్నా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఇద్దరు ముగ్గురు కలిసి ఓ టూ వీలర్ మీద వచ్చి పనిచూసుకొని హాయిగా వెళ్తున్నారు. దూరాల తీరాలను చెరిపేసి దగ్గరితనాన్ని పెనవేసుకోవటం అంటే ఇంతకన్నా వేరే నిర్వచనం ఉంటుందా?
– నూర శ్రీనివాస్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

