రామి చక్కని బొమ్మ!

చెన్నైలోని స్వామి స్కూల్లో బుద్ధిగా చదువుకొంటూనే బాలనటిగా తెరంగేట్రం చేసింది అమ్ము. ‘ఎన్ అలోడా సెరుప్ప కనోమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ భామ, ‘భైరవ’చిత్రంలో కీర్తి సురేష్‌తోపాటు ఓ వైద్య విద్యార్థి పాత్రలో తెలుగు ప్రేక్షకులను కనికట్టు చేయనుంది. ఆ పెద్దపెద్ద కండ్లకు అంత శక్తి ఉంది.
చెన్నై నుంచి వచ్చి టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది.. అమ్ము అభిరామి. సహాయనటిగా కోలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ఈ చిన్నది, ఇప్పుడు ఏకంగా హీరోయిన్గా అలరిస్తున్నది. ‘నారప్ప’తో తెలుగు ప్రేక్షకులను మురిపించిన అందాల అమ్ము గురించి..
తమిళంలో విజయం సాధించిన ‘రాటసన్’ తెలుగు రీమేక్ (రాక్షసుడు)లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మేనకోడలిగా అమ్ము నటన అందరినీ ఆకట్టుకొంది. కోలీవుడ్‌లో విజయ్, ధనుష్, కార్త్తి, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి, అందరి మెప్పూ పొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హీరోయిన్గా అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు దక్కించుకొంటున్నది.
తమిళంలో మణిరత్నం నిర్మిస్తున్న ‘నవరస’ వెబ్ సిరీస్‌లో కీలకపాత్ర పోషిస్తున్న అభిరామిని టాలీవుడ్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్‌లో ముఖ్యపాత్ర కోసం అభిరామి ఎంపికైనట్టు ఇన్సైడ్ టాక్.
హీరో చెల్లిగా, హీరోయిన్ ఫ్రెండ్‌గా అల్లరి చేసే బబ్లీ క్యారెక్టర్స్‌లోనే కాదు.. సెంటిమెంట్ పాత్రల్లోనూ మెప్పించగలదు అమ్ము అభిరామి. ధనుష్ నటించిన ‘అసురన్’ చిత్రంలో అమ్ము నటనకు విమర్శకుల ప్రశంసలే కాదు, తెలుగు రీమేక్‌గా వచ్చిన ‘నారప్ప’లోఅవకాశమూ దక్కింది.
తొలినాళ్లలోనే కెరీర్‌ను చక్కగా మలుచుకొన్న అమ్ము, భవిష్యత్తులోనూ సరైన నిర్ణయాలు తీసుకొంటే మంచిస్థాయికి చేరుకోగలదంటున్నారు సినీ పండితులు. ‘తెలుగు ప్రేక్షకులు ఇంత ఆదరణ చూపిస్తారని ఊహించలేదు. మంచిపాత్రలతో అందరినీ అలరించడమే నా ముందున్న లక్ష్యం’ అంటున్నదీ చెన్నై చిన్నది.
జగపతిబాబు
ప్రధానపాత్రలో, ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన F.C.U.K (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) చిత్రంలో హీరోయిన్గా తొలి అవకాశం అందుకొంది అమ్ము అభిరామి. సినిమా ఫలితం ఎలా ఉన్నా అమ్ము నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందులోనూ, వర్జినిటీ గురించి అభిరామి చెప్పిన డైలాగులు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో అమ్మును ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- bhathukamma news
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

