నేనంతే.. టామ్‌బాయ్ టైపు!

మంగళూరు సోయగం పూజా హెగ్డే. ‘ముకుంద’లో గోపికమ్మగా మురిపించింది. ‘రంగస్థలం’లో జిగేల్ రాణిలా మెరిసిపోయింది. ‘అల వైకుంఠపురములో’ ఇలకు దిగొచ్చిన రంభే!‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన హాట్ బ్యూటీ పూజా హెగ్డే మనోగతం..
- ఒకే రకమైన పాత్రలు చేయడం నాకు అస్సలు నచ్చదు. పోలికలేని క్యారెక్టర్స్‌కే మొగ్గు చూపుతాను. ప్రతి హీరోయిన్‌లానే పెద్ద సినిమాల్లో చేసి మంచిపేరు తెచ్చుకోవాలనే
ఆశ నాకూ ఉంది. నా కెరీర్ అనుకున్నట్టుగానే సాగుతున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నప్పటినుంచీ నేను టామ్‌బాయ్ టైపు. - ఒక్క సినిమా సక్సెస్ కాగానే పారితోషికం పెంచేశానని రకరకాలుగా మాట్లాడుకున్నారు. నేను అవన్నీ పట్టించుకోను. కష్టనష్టాలు తట్టుకుని విజయం సాధించడం మాటలు కాదు. హీరోల పారితోషికం విషయంలో రాని చర్చలు, మా విషయంలోనే ఎందుకన్నది నాకు అర్థం కాదు.
- ఏ హీరో,హీరోయిన్ అయినా చేసిన ప్రతి సినిమా ఆడుతుందన్న గ్యారెంటీ ఉండదు. అలా అని, జయాపజయాలను లెక్కించుకుంటూ కూర్చుంటే కెరీర్లో ముందుకెళ్లలేం.
నేను ఒక ప్రాజెక్ట్ ఒప్పుకొనేటప్పుడు నా పాత్రకంటే కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. - మనం ఈ లోకంలోకి రావడానికి ముందే, సమాజంలో మన పాత్ర ఏమిటనేది విధి నిర్ణయించి ఉంటుంది. సృష్టికర్త స్క్రిప్ట్ ప్రకారమే నేను నటినయ్యాను. విధాత
రాసిపెట్టి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అదృష్టం లేకపోతే, ఏ రంగంలోనైనా రాణించడం కష్టమే. నా శ్రమ, పట్టుదలకు అదృష్టం జత కావడం వల్లే ఈ రోజు ఇంతమంది
నన్ను అభిమానిస్తున్నారు. - ఇండస్ట్రీకి వచ్చాక నాలో చాలా మార్పులు వచ్చాయి. ఓర్పు, సహనం పెరిగాయి. కొన్నిసార్లు గంటల తరబడి మేకప్ వేసుకోవాలి. ప్రతి షాట్‌కూ గ్యాప్! వేరే
ఆర్టిస్ట్‌ల కాంబినేషన్లో సీన్స్ తీసేటప్పుడు, చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సినీ పరిశ్రమలో సహనం చాలా అవసరం. ఏ మాత్రం తేడా వచ్చినా పొగరుబోతు, కోపం ఎక్కువ ..అని ముద్ర వేస్తారు. - ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, చిరంజీవి ‘ఆచార్య’తోపాటు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌తో ఒక చిత్రంలో నటిస్తున్నాను. ఇలాగే, ఎప్పుడూ అందరినీ అలరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోవాలన్నది నా ఆశ.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Pooja hegde
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | నెట్‌ఫ్లిక్స్‌కు FWICE గట్టి వార్నింగ్.. భారత్‌లో ఆ పాకిస్థానీ వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తే షూటింగ్స్ బంద్!
Hyderabad | కొండాపూర్‌లో అక్రమ సెల్లార్ నిర్మాణం.. కూలిన పక్క హోటల్ గోడ, పలువురికి గాయాలు!
Road Accident | ఇచ్చోడ జాతీయ రహదారిపై కారు బోల్తా.. నలుగురికి గాయాలు
గద్వాల ఆర్టీవో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన.. DTOతో మాట్లాడిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
Niranjan Reddy | ప్రభుత్వ కార్యాలయం కోసం పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేయొద్దు: నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

