Psychological Disorders | మీ మానసిక స్థితి ఎలా ఉందో టెస్ట్ చేసుకుంటారా.. ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు!
Psychological Disorders | ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో పనిచేస్తున్న నీనా సావంత్ సైకియాట్రిస్ట్. మానసిక చికిత్సలో ఆమెకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఆ నైపుణ్యాన్ని జోడించి ఓ మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
Psychological Disorders | ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో పనిచేస్తున్న నీనా సావంత్ సైకియాట్రిస్ట్. మానసిక చికిత్సలో ఆమెకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఆ నైపుణ్యాన్ని జోడించి ఓ మంచి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఎవరికి వారు మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించుకునేలా, పరిరక్షించుకునేలా ‘సక్షం’ అనే మొబైల్ యాప్‌ను రూపొందించారు. యాప్ మూడు అంచెల్లో పనిచేస్తుంది. వివిధ ప్రశ్నల ద్వారా మన మానసిక స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది.
కొన్ని రకాలైన సమస్యలను ఎలా ఎదుర్కోవచ్చు అనే విషయంలో సూచనలు ఇస్తుంది. పరిస్థితి ఆందోళనకరంగా అనిపిస్తే… సమీపంలోని నిపుణుల పేర్లు, ఫోన్ నంబర్లు అందిస్తుంది. చాలా సందర్భాల్లో మనకో, మన ఆత్మీయులకో, మన చుట్టుపక్కలవారికో మానసిక సమస్య ఉందంటే ఒప్పుకోం. ఒప్పుకొన్నా, ఆ సమస్యను నిపుణుల దాకా తీసుకెళ్లం. ‘..అలాంటివారికి అవగాహన కలిగించే ప్రయత్నమే సక్షం’ అంటారు నీనా సావంత్. ఈ యాప్‌ను ఉపయోగించిన వారినుంచి సానుకూల స్పందన వస్తున్నదని చెబుతారు నీనా.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

