జస్ట్ డాగ్స్ బై పూర్వి
అభిరుచిని, ఆసక్తిని కెరీర్‌గా ఎంచుకునే అవకాశం పూర్విలాంటి ఏ కొద్ది మందికో దక్కుతుంది. పెంపుడు కుక్కల పట్ల మమకారమే పూర్వి ఆంథోనీతో స్టార్టప్ దిశగా అడుగులు వేయించింది.
అభిరుచిని, ఆసక్తిని కెరీర్‌గా ఎంచుకునే అవకాశం పూర్విలాంటి ఏ కొద్ది మందికో దక్కుతుంది. పెంపుడు కుక్కల పట్ల మమకారమే పూర్వి ఆంథోనీతో స్టార్టప్ దిశగా అడుగులు వేయించింది.‘జస్ట్ డాగ్స్’ ఆమె కలల పంట. అహ్మదాబాద్‌లో చిన్న దుకాణంగా మొదలైన వ్యాపారం నూటపది కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. దాదాపు ఇరవైవేలమంది కస్టమర్లు ఆమె పరివారంలో ఉన్నారు. గత కొన్నేండ్లుగా
పెట్‌కేర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్నది.
పెంపుడు కుక్కలను కుటుంబ సభ్యుల్లా చూస్తున్నారు. తమ పిల్లలతో సమానంగా, వాటి కోసమూ ఖర్చు పెడుతున్నారు. ఆహారం, వైద్య సేవలు, సలహాలు.. ఇలా పెంపుడు జంతువుల యజమానులకు అవసరమైన సేవలన్నీ అందిస్తుంది జస్ట్ డాగ్స్. కుక్కలు ఆడుకోవడానికి బొమ్మలు, కుక్కల్ని ముస్తాబు చేయడానికి అలంకరణ వస్తువులు కూడా విక్రయిస్తుంది. డాగ్ ట్రైనింగ్ విభాగాన్నీ ఏర్పాటు చేసుకుంది. జస్ట్ డాగ్స్.. పనితీరుకు ముచ్చటపడి చాలామంది ఇన్వెస్టరు ్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. అన్నట్టు, పూర్వి భర్త అశిష్ కూడా శునకాభిమానే.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

