మిషెలిన్.. అంతర్జాతీయంగా ఉత్తమ రెస్టారెంట్లకు ఇచ్చే గుర్తింపు. బ్యాంకాక్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయురాలు గరిమ అరోరా, తన ‘గా రెస్టారెంట్’కు రెండు మిషెలిన్లను అందుకున్నారు. విదేశాల్లో ఓ భారతీయ రెస్టారెంట్ అంతటి గుర్తింపును పొందడం మామూలు విషయం కాదు. ఈ ప్రయాణం వెనుక చాలా ఆసక్తికరమైన మజిలీలు ఉన్నాయి. చిన్నతనంలో తన నాయనమ్మ దగ్గర వంటల పాఠాలు నేర్చుకున్నారు గరిమ.
తండ్రి కూడా పాకశాస్త్ర నిపుణుడే. షెఫ్‌గా, టేస్టర్‌గా అపార అనుభవం ఉంది. కూతురి పాకశాస్త్ర ప్రయోగాలను మనస్ఫూర్తిగా ప్రోత్సహించేవారు. తనకు తెలిసిన చిట్కాలన్నీ బోధించేవారు. వారసత్వ విజ్ఞానానికి పారిస్‌లో అందుకున్న డిగ్రీతో పరిపూర్ణత చేకూరింది. డెన్మార్క్‌లోని ఓ సుప్రసిద్ధ హోటల్లో పనిచేసి గ్లోబల్ కిచెన్ మీద పట్టు సాధించారు. ఆ అనుభవంతో 2017లో బ్యాంకాక్‌లో ‘గా రెస్టారెంట్’ ఆరంభించారు. ‘ఇదంతా ఒక్క రోజుతో సాధ్యం కాలేదు. బాల్యం నుంచీ నేను కంటున్న కలలకు నిజరూపం’ అని నవ్వేస్తారు గరిమ.