కలల గడి
ఇగోనుల్ల! ఇది గూడ మన చెన్నాల్రామలింగం కతనే! మీకు ఎర్కున్నదే గనీ.. మనం మన బాసల జెప్పుకొందం! ఒకపారి మస్కుల్ల కిష్ణదేవరాయలకు ఒక కలవడ్డది. ఒక బంగారంతోని ఒక జెబ్బర్దస్త్ గడి గట్టినట్టు.
ఇగోనుల్ల! ఇది గూడ మన చెన్నాల్రామలింగం కతనే! మీకు ఎర్కున్నదే గనీ.. మనం మన బాసల జెప్పుకొందం! ఒకపారి మస్కుల్ల కిష్ణదేవరాయలకు ఒక కలవడ్డది. ఒక బంగారంతోని ఒక జెబ్బర్దస్త్ గడి గట్టినట్టు.. గోడలకు వజ్రాలు, వైడూర్యాలు పుదిచ్చినట్టు.. ఇంక నీల్లల్ల తేలుతున్నట్టు కలవడ్డది. రాజాయె మరి! తెల్లారంగనే కచేరి దీశిండు. అందర్ని విలిశి.. కల ముచ్చట ఎర్కజేశిండు. ఆ గడి యాడున్నదో ఎంకులాడుమని జెప్పిండు. అలో అంటే.. పొలో అనలేక.. నపరోదిక్కు ఎంకులాడ వోయిండ్లు అందరూ. రాజ్యంల యాడ జూశినా గిదే ముచ్చట.
తిరుక్కంట తిరుక్కుంట ఒక మంత్రి చెన్నాల్రామలింగం తానకు వోయి.. రాజుకు కల అచ్చుడు, అందరూ ఎంకులాడే ముచ్చట జెప్పిండు. ఆయినెను గూడ మదత్ జెయ్యిమని అడిగిండు. తెల్లారి కచేరిల అందరు గూసున్నప్పుడు.. ఒక ముసలాయినె నెత్తీనోరు గొట్టుకుంట, ఏడ్సుకుంట లోపటికి అచ్చిండు. ఏమైందంట రాజు అడుగంగానే.. “అయ్యా! నా ఇంట్ల దొంగవడి ఆయిన్ని ఎత్కపోయిండు. నువ్వే నాయం జేయాలె!” అంట కాళ్లమీద వడ్డడు. “ఆ దొంగ ఎవలో సూసినవా!?” అంట మల్లడిగిండు రాజు. “సూశిన గనీ.. పేరు జెప్తె నన్ను జైల్ల ఎయ్యద్దు బాంచెన్!” అంట బతిమ్లాడిండు.
- పుట్టినప్పుడు పురుగు! పెరిగాక పువ్వుల రాజు?
– తుమ్మెద
- బంగారు బిడ్డలు. వెచ్చని దుస్తులు. గుర్రపు వెంట్రుకలు?
– మక్కజొన్న
- కొనేటప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పారేసేటప్పుడు తెలుపు?
– పుచ్చకాయ
“సరే జెప్పు!” అని రాజు అనంగనే.. “రాజా! మా ఇంట్ల నువ్వే దొంగతనం జేసినవ్!” అంట దండం బెట్టిండు. “పాగల్ గానివా! నేను రాత్రి ఊళ్లెనే లేను. నకురాల్ జెయ్యకు!” అంట గర్మికచ్చిండు రాజు. “నిన్న కలల నువ్వే అచ్చి నా ఇంట్లకెల్లి అన్ని ఎత్కపోయినవ్ బాంచెన్!” అంట మల్ల దండం బెట్టిండు ముసలాయినె. “అరే! ఏన్నన్న కలల అచ్చినయి నిజమైతాయి? చుప్.. నడువ్!” అంట గద్దరిచ్చిండు రాజు. “రాజా! మరి నీకు కలల గనిపించిన గడి నిజంగున్నప్పుడు.. నా కల నిజం గాదా బాంచెన్!” అంట మల్ల దండం బెట్టిండు. అది ఎవల ఇకమతో తెలిసి.. రాజు నవ్వుకుంట లోపలికి వోయిండు.
మీకు తెలుసా?
ఆకాశంలో ఎగరగలిగే జీవులు పక్షులు మాత్రమే! కొన్ని రకాల పక్షులైతే ఆకాశ
మార్గంలో వేల కిలోమీటర్లు వలస వెళ్తాయి. కానీ.. పెంగ్విన్, నిప్పుకోడి, ఈము, కివీ లాంటి పక్షులు ఎగరలేవు. అయితే, ఈ ఎగరలేని పక్షుల్లో పెంగ్విన్కు మాత్రమే ఒక ప్రత్యేకత ఉంది. ఈ పక్షులు నడుస్తూనే.. ఏటా 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు వలస వెళ్తాయి.
పద్యం – భావం
పాలను గలిసిన జలమును పాల విధంబుననె యుండు బరికింపంగా బాల చవి జెఱచు గావున బాలసుడగు వాని పొందు వలదుర సుమతీ!
భావం : పాలలో కలిసిన నీళ్లు కూడా చూడటానికి తెల్లగానే ఉంటాయి. కానీ, ఆ నీరు పాలలో కలిసినందువల్ల.. పాలకు ఉండే సహజమైన రుచి పోతుంది. దుర్మార్గుడు కూడా చూడటానికి మామూలుగానే కనిపిస్తాడు. కానీ, మంచివారిలో ఉండే సజ్జన గుణాన్ని పోగొడతాడు. కాబట్టి, చెడ్డవాళ్లతో స్నేహం పనికిరాదు.
Read Today's Latest Stories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

