FIFA World Cup 2026 | అల్జీరియాకు తొలి విజయం.. ఇంటిదారి పట్టిన జోర్డాన్..!
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్‌కప్ నుంచి పశ్చిమాసియా జట్టు జోర్డాన్(Jordan) నిష్క్రమించింది. గ్రూప్ జే లీగ్ దశలో అల్జీరియా(Algeria) చేతిలో అనూహ్య ఓటమితో ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది.
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్‌కప్ నుంచి పశ్చిమాసియా జట్టు జోర్డాన్(Jordan) నిష్క్రమించింది. గ్రూప్ జే లీగ్ దశలో అల్జీరియా(Algeria) చేతిలో అనూహ్య ఓటమితో ఆ జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది. తొలి అర్ధ భాగంలో జోరు చూపించినా.. రెండో అర్ధ భాగంలో తర్వాత తడబడింది. ఫలితంగా 1-2తో పరాజయం పాలై ఇంటిదారి పట్టింది. గ్రూప్ జే నుంచి ముందంజ వేయలేకపోయిన జట్టుగా జోర్డాన్ నిలిచింది. ఆరంభ పోరులో అర్జెంటీనా చేతిలో చిత్తైన అల్జీరియా సూపర్ విక్టరీతో బోణీ కొట్టింది.
క్యాలీఫోర్నియాలోని సాంటా క్లారాలో మంగళవారం గ్రూప్ జేలోని జోర్డాన్, అల్జీరియా తలపడ్డాయి. నాకౌట్‌కు పోటీ తీవ్రమైన వేళ.. ఇరుజట్లు హోరాహోరీగా ఢీకొన్నాయి. మ్యాచ్ మొదలైన తొలి అర్ధ భాగంలో జోర్డాన్ ఆధిపత్యం చెలాయించింది. అరంగేట్రం కుర్రాడు నిజర్ అల్ రష్దన్ ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించి తొలి గోల్ అందించాడు. దాంతో.. జోర్డాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
🚨 FULL TIME: 🇯🇴 JORDAN 1-2 ALGERIA 🇩🇿
⚽ Nizar Al-Rashdan 🇯🇴
⚽ Nadhir Benbouali 🇩🇿
⚽ Amine Gouiri 🇩🇿😮 Jordan took the lead through Al-Rashdan
🔥 Algeria fought back in the second half
⭐ Gouiri scores the winner to keep the dream alive#FIFAWorldCup #WorldCup2026… pic.twitter.com/ogKYJMhPQe— Sporcaster (@Sporcaster) June 23, 2026
అయితే.. రెండో అర్ధ భాగంలో అల్జీరియా ఆటగాళ్లు నధిర్ బెన్బౌలీ 69వ నిమిషంలో, అమినే గొయిరిలు.. చెరొక గోల్ కొట్టారు. దాంతో, 2-1తో జోర్డాన్‌ను చిత్తు చేసింది అల్జీరియా. ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన జోర్డాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

