Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
Yuvraj Singh : భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh)కి కీలక పదవి దక్కింది. ఒకప్పుడు సిక్సర్లతో అలరించిన యూవీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కోచింగ్ యూనిట్లో చేరాడు.
Yuvraj Singh : భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ (Yuvraj Singh)కి కీలక పదవి దక్కింది. ఒకప్పుడు సిక్సర్లతో అలరించిన యూవీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కోచింగ్ యూనిట్లో చేరాడు. టీ20ల్లో విధ్వంసక ఆటగాడిగా పేరొందిన ఈ మాజీ ఆల్‌రౌండర్ ఢిల్లీ జట్టుకు అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు. మొన్నటి వరకు టీమిండియా ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ వంటి వారికి మెంటర్‌గా వ్యవహరించిన అతడు ఈసారి ఢిల్లీ కుర్రాళ్ల ఆటను సానబెట్టనున్నాడు.
ఐపీఎల్ 20వ సీజన్ వేలానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ వేగం పెంచింది. ఇటీవలే సౌరవ్ గంగూలీకి ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించిన డీసీ.. అనుభవజ్ఞుడైన యువరాజ్ సింగ్‌ను తమ కోచింగ్ సిబ్బందిలోకి ఆహ్వానించింది. టీమిండియా స్టార్ అభిషేక్ శర్మ, మెరుపు ఆటతో అలరించే ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు మెంటర్‌గా మంచి ఫలితాలు రాబట్టిన యూవీని తమ జట్టుకు అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. దాంతో.. అధికారికంగా యూవీ తొలిసారి కోచింగ్ బాధ్యలు చేపట్టనున్నాడు. ఈ దిగ్గజ ఆటగాడిని ఢిల్లీ సహాయక కోచ్‌గా తీసుకున్న విషయాన్ని మంగళవారం హెడ్‌కోచ్ గంగూలీ వెల్లడించాడు.
A champion. A leader. 𝐀 𝐓𝐢𝐠𝐞𝐫. 🐅🔥
The legend who inspired generations is ready to shape Dilli’s legacy. Welcome home, Yuvi paa! 💙❤️ https://t.co/i7A77rv2tJ
— Delhi Capitals (@DelhiCapitals) October 13, 2026
‘ఢిల్లీ క్యాపిటల్స్ కుటుంబంలోకి యూవీని ఆహ్వానిస్తున్నందుకు నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది’ అని ఫ్రాంజైజీ చైర్మన్ పార్త్ జిందాల్ వెల్లడించాడు. ‘భారత జట్టు గొప్ప మ్యాచ్ విన్నర్లలో యూవీ ఒకడు. అంతేకాదు ప్రస్తుతం టీమిండియలో ఉన్న యువ ఆటగాళ్లకు అతడు మెంటర్‌గానూ వ్యవహరించాడు. అతడి అనుభవం, విజయమే లక్ష్యంగా ఆలోచనలు.. ఆటగాళ్లతో కలిసిపోయే తీరు మా స్క్వాడ్‌కు అమూల్యమైనవి’ అని జిందాల్ పేర్కొన్నాడు. యువరాజ్ కూడా పాత ఫ్రాంచైజీకి సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
రికార్డు ధర..
ఒకప్పుడు ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకు ఆడిన యువరాజ్ ఈసారి కోచ్‌గా వస్తున్నాడు. 2015 ఎడిషన్ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ అతడిని రూ.16 కోట్లకు కొన్నది. ఈ మెగా ఈవెంట్లో అప్పటివరకూ అంత ధర పలికింది యూవీనే. దాంతో.. ఐపీఎల్ చరిత్రంలో అత్యంత విలువైన ఆటగాడిగా అతడు రికార్డు నెలకొల్పాడు. ఆ సీజన్లో 14 మ్యాచులాడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ రెండు అర్ధ శతకాలతో కలిపి 248 పరుగులు చేశాడు. మొత్తంగా పది సిక్సర్లు బాదిన అతడి అత్యధిక స్కోర్.. 57.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

