హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ బిగ్ బోర్ షూటింగ్ చాంపియన్షిప్లో హైదరాబాద్ యువ షూటర్ రాయన్ ఫైసల్ యూసుఫుద్దీన్ రెండు స్వర్ణాలతో పాటు సరికొత్త స్టేట్ రికార్డుతో సత్తా చాటాడు. జూనియర్ మెన్ 300మీ రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో రాయన్ 287/300 స్కోరుతో స్టేట్ రికార్డు బ్రేక్ చేస్తూ స్వర్ణం అందుకున్నాడు.
ఇదే ఈవెంట్ సీనియర్ పురషుల విభాగంలోనూ 287/300 స్కోరుతో మరో స్వర్ణ పతకం సాధించాడు. ఇప్పటికే పలు స్టేట్, నేషనల్ ఈవెంట్లలో పతకాలు నెగ్గిన రాయన్ రైఫిల్ షూటింగ్లో అత్యంత వేగంగా ముందుకెళ్తున్నాడు.