చెన్నై: ఈ సీజన్లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ఆ జట్టులో గాయాలతో మ్యాచ్‌లకు దూరమైన ఆటగాళ్ల జాబితా నానాటికీ పెరుగుతున్నది. ఇప్పటికే ఖలీల్, ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్ వంటి ఆటగాళ్లు గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమవగా అదే సమస్యతో ఇబ్బందిపడుతూ స్టార్ బ్యాటర్ బ్రెవిస్ ఇటీవలే కోలుకున్నా ధోనీ ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. ఇక తాజాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో యువ బ్యాటర్ ఆయుష్ మాత్రె సైతం గాయంతో సీజన్లో పలుమ్యాచ్లకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో మ్యాచ్ లో మంచి టచ్‌లో ఉన్న మాత్రె.. తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడి ఔటయ్యాడు. మాత్రె గాయాన్ని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కూడా ధృవీకరించి అతడు పలు మ్యాచ్‌లకు దూరమవుతాడని చెప్పకనే చెప్పాడు.