Dhyan Chand: గోల్స్‌ను పరుగుల్లాగా చేస్తావ్.. ధ్యాన్‌చంద్‌ను బ్రాడ్‌మన్ ఆకాశానికెత్తిన వేళ
ఒకరు హాకీ మాంత్రికుడు.. ఈ గేమ్‌లో లెజెండరీ ప్లేయర్. మరొకరు క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్. ఈ ఇద్దరూ కలవడమే ఓ అరుదైన సందర్భమైతే.. ఓ లెజెండ్ మరో లెజెండ్‌ను ఆకాశానికెత్తడం మరో విశేషం. ఆగస్ట్ 29 హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్( Dhyan Chand ) జయంతి సందర్భంగా అతని జీవితంలో జరిగిన ఓ అపురూప ఘటన గురించి గుర్తు చేసుకుందాం.

న్యూఢిల్లీ: ఒకరు హాకీ మాంత్రికుడు.. ఈ గేమ్‌లో లెజెండరీ ప్లేయర్. మరొకరు క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్. ఈ ఇద్దరూ కలవడమే ఓ అరుదైన సందర్భమైతే.. ఓ లెజెండ్ మరో లెజెండ్‌ను ఆకాశానికెత్తడం మరో విశేషం. ఆగస్ట్ 29 హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్( Dhyan Chand ) జయంతి సందర్భంగా అతని జీవితంలో జరిగిన ఓ అపురూప ఘటన గురించి గుర్తు చేసుకుందాం. 1905, ఆగస్ట్ 29న జన్మించిన ధ్యాన్‌చంద్ హాకీ మాంత్రికుడిగా పేరుగాంచాడు. ఇండియన్ టీమ్ ఒలింపిక్స్‌లో సాధించిన మొత్తం 8 గోల్డ్ మెడల్స్‌లో మూడింట్లో ధ్యాన్‌చంద్‌దే కీలకపాత్ర. అంతటి ప్లేయర్ గౌరవార్థం ఈ మధ్యే భారత ప్రభుత్వం క్రీడల్లో అత్యున్నత పురస్కారం ఖేల్‌రత్నకు ధ్యాన్‌చంద్ పేరు పెట్టిన విషయం తెలిసిందే.
అయితే ఈ హాకీ లెజెండ్ ఒకసారి క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ అయిన డాన్ బ్రాడ్‌మన్‌ను కలిశాడన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. టెస్ట్ క్రికెట్లో 99.94 సగటుతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న ఈ డాన్.. ఓ సందర్భంలో ధ్యాన్చంద్తోపాటు ఇండియన్ టీమ్‌ను కూడా ఆకాశానికెత్తాడు. 1932 బెర్లిన్ ఒలింపిక్స్‌కు ముందు ఇండియన్ హాకీ టీమ్ ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. అక్కడ ఒక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 11-2 తేడాతో టీమిండియా చిత్తుగా ఓడించింది. అందులో ధ్యాన్‌చంద్ ఏకంగా ఆరు గోల్స్ చేశాడు.
ఆ తర్వాత టీమ్ అడిలైడ్ వెళ్లినప్పుడు బ్రాడ్‌మన్‌ను ధ్యాన్‌చంద్ ప్రత్యేకంగా ఆహ్వానించాడు. ఓ హాకీ మ్యాచ్‌ను డాన్ ప్రత్యక్షంగా చూడటం అదే తొలిసారి. ఇండియన్ టీమ్ ఆడిన తీరు చూసి బ్రాడ్‌మన్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత టీమ్ సభ్యులను కలిసి పొగడ్తల వర్షం కురిపించాడు. మీ నుంచి ఎంతో కొంత నేర్చుకునే అవకాశం దక్కింది. మీ తర్వాత ఇండియన్ క్రికెట్ టీమ్ కూడా వస్తుందని భావిస్తున్నా అని డాన్ అన్నాడు. ఇక ధ్యాన్‌చంద్‌తో మాట్లాడుతూ.. మీరు క్రికెట్లో పరుగుల్లాగా గోల్స్ చేస్తారు కదా అని బ్రాడ్‌మన్ అనడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

