న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా మంది జనాలు ధోని ఎప్పుడూ సీరియస్గా ఉంటాడని భావిస్తారని, వాస్తవానికి ఆయన అలాగే ఉంటాడని హార్డిక్ చెప్పాడు. కానీ నాతో మాత్రం సీరియస్గా ఉండడటని, ఇద్దరం జాలీగా మాట్లాడుకుంటామని అన్నాడు.
నేను మాత్రం ధోని మీద జోకులు కూడా వేస్తానని, ఆయనతో సరదాగా ఉంటానని హార్దిక్ తెలిపాడు. నేను ఆయనను మహేంద్రసింగ్ ధోనిగా చూడనని, ఒక ప్రియమైన స్నేహితుడిగా, నాతో ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఒక సోదరుడిగా చూస్తానని చెప్పాడు. ధోనీ చాలా మంచి వ్యక్తి అని, ఆయనను ద్వేషించాలంటే మీరు కచ్చితంగా ఒక దెయ్యమై ఉండాల్సి ఉంటుందని హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు.