Yashasvi Jaiswal: ద్రావిడ్‌ను దాటేసిన యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal: జైస్వాల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. ముంబైపై సెంచరీ కొట్టిన అతను ఆ క్రమంలో తన ఖాతాలో ఓ రికార్డు వేసుకున్నాడు. ఆర్ఆర్ ఫ్రాంచైజీ తరపున అత్యధిక రన్స్ చేసిన అయిదవ బ్యాటర్‌గా నిలిచాడు. ద్రావిడ్‌ను జైస్వాల్ దాటేశాడు.
జైపూర్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన అయిదవ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను రాహుల్ ద్రావిడ్‌ను దాటేశాడు. ఆర్ఆర్ ఫ్రాంచైజీ తరపున అత్యధిక రన్స్ చేసిన అయిదవ బ్యాటర్ జైస్వాల్ అయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో అతను ఆ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 60 బంతుల్లో 104 రన్స్ చేశాడు.
ఆర్ఆర్ తరపున జైస్వాల్ ఇప్పటి వరకు 45 మ్యాచ్‌లు ఆడాడు. దీంట్లో అతను 1397 రన్స్ స్కోర్ చేశాడు. స్కోరింగ్ యావరేజ్ 32.48గా ఉంది. అతని స్ట్రయిక్ రేట్ 150.05. దీంట్లో రెండు సెంచరీలు, 8 ఫిఫ్టీలు ఉన్నాయి. అతని బెస్ట్ స్కోర్ 124.
మరో వైపు ఆర్ఆర్ తరపున రాహుల్ ద్రావిడ్ 52 మ్యాచ్‌లు ఆడాడు. ఆ మ్యాచుల్లో అతను 1324 రన్స్ స్కోర్ చేశాడు. 27.02 యావరేజ్‌తో ద్రావిడ్ స్కోరింగ్ చేశాడు. అతని స్ట్రయిక్ రేట్ 108.88గా ఉంది. ద్రావిడ్ తన కెరీర్లో ఏడు హాఫ్ సెంచరీలు కొట్టాడు. బెస్ట్ స్కోర్ 66.
రాజస్తాన్ రాయల్స్ తరపున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. అతను 138 మ్యాచుల్లో 3717 రన్స్ స్కోర్ చేశాడు. యావరేజ్ 31.50గా ఉంది. స్ట్రయిక్ రేట్ 13978. దీంట్లో రెండు సెంచరీలు, 23 ఫిఫ్టీలు ఉన్నాయి. అతని బెస్ట్ స్కోర్ 119.
ఈ సీజన్లో ఆర్ఆర్ తరపున జైస్వాల్ 225 రన్స్ స్కోర్ చేశాడు. 32.14 యావరేజ్‌తో అతను బ్యాటింగ్ చేశాడు. స్ట్రయిక్ రేట్ 157.34గా ఉంది. దీంట్లో ఓ సెంచరీ ఉన్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

