WPL 2024 | గుజరాత్‌కు ఓ గెలుపు.. పోరాడి ఓడిన బెంగళూరు
WPL 2024, GG vs RCB | మహిళల ప్రీమియర్ లీగ్‌లో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు విజయం రుచి చూసింది. ఆర్సీబీతో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి 199 పరుగుల భారీ స్కోరుచేసిన గుజరాత్.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అదరగొట్టింది.
WPL 2024, GG vs RCB | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో గుజరాత్ జెయింట్స్ గెలుపు బోణీ కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్.. 19 పరుగుల తేడాతో గెలిచి ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదుచేసింది. గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల ఛేదనలో ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో జార్జియా వర్హెమ్ (22 బంతుల్లో 48, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రిచా ఘోష్ (21 బంతుల్లో 30, 5 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. కానీ ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండటంతో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం, సరైన భాగస్వామ్యాలు నిర్మించుకోలేకపోవడం ఆర్సీబీని దెబ్బతీశాయి. గుజరాత్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ రాణించింది.
భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఐదో ఓవర్లోనే తొలి షాక్ తాకింది. తనూజా కన్వర్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్ కొట్టిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (16 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)ను ఆష్లే గార్డ్నర్ పెవిలియన్ పంపింది. మరుసటి ఓవర్లో.. 13 బంతులాడి 4 పరుగులే చేసిన సబ్బినేని మేఘన రనౌట్ అయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో తొలి స్ట్రాటజికల్ బ్రేక్ అయ్యేటప్పటికీ (8 ఓవర్లకు) ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులే చేసింది.
9 ఓవర్ వేసిన మేఘనా సింగ్ ఓవర్లో 14 పరుగులు రాగా పదో ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. అయితే 11 వ ఓవర్లో ఆర్సీబీకి మరో షాక్ తగిలింది. 16 బంతులు ఆడి ఒక ఫోర్, రెండు భారీ సిక్సర్లతో 23 పరుగులు చేసిన సోఫి డెవిన్‌ను తనూజా కన్వర్ 11వ ఓవర్లో తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ ఓవర్‌తో పాటు షబ్నమ్ షకీల్ వేసిన 12వ ఓవర్లో కలిసి 12 పరుగులొచ్చాయి. క్యాథరిన్ బ్రైస్ విసిరిన 14వ ఓవర్లో ఆర్సీబీ కీలక బ్యాటర్ ఎల్లీస్ పెర్రీ (23 బంతుల్లో 24, 3 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. 15వ ఓవర్లో రిచా రెండు, వర్హెమ్ ఒక ఫోర్ కొట్టారు.
ఆఖర్లో పోరాడినా..
చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు విజయానికి 30 బంతుల్లో 81 పరుగులు అవసరమొచ్చింది. గార్డ్నర్ వేసిన 16వ ఓవర్లో రెండు ఫోర్లు వచ్చినా రిచా ఘోష్ (21 బంతుల్లో 30, 5 ఫోర్లు, 1 సిక్స్) ను ఔట్ చేసింది. కన్వర్ వేసిన 17 వ ఓవర్లో 13 పరుగులొచ్చాయి. కానీ 18వ ఓవర్ విసిరిన బ్రైస్ 9 పరుగులే ఇచ్చింది. మేఘనా సింగ్ వేసిన 19వ ఓవర్లో వర్హెమ్ 6, 4 బాదినా మూడో బాల్‌కు మోలినెక్స్ (3) రనౌట్ అయింది. ఆఖరి బంతికి వర్హెమ్ కూడా రనౌట్‌గానే వెనుదిరగడంతో ఆర్సీబీ ఓటమి ఖరారైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

