WPL 2024, GG vs DC | తొలి విజయం కోసం గుజరాత్.. అగ్రస్థానంపై కన్నేసిన ఢిల్లీ.. టాస్ జెయింట్స్‌దే..
WPL 2024, GG vs DC | బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ వైఫల్య ప్రదర్శనలతో విసుగు తెప్పిస్తున్న గుజరాత్ జెయింట్స్.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మరో రెండు రోజుల్లో టోర్నీ ఢిల్లీకి షిఫ్ట్ కాబోతున్న నేపథ్యంలో గుజరాత్‌కు బెంగళూరులో ఇదే ఆఖరి మ్యాచ్.
WPL 2024, GG vs DC | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడి హ్యాట్రిక్ ఓటములు నమోదుచేసిన గుజరాత్ జెయింట్స్ తొలి విజయం కోసం పడరాని పాట్లు పడుతోంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ వైఫల్య ప్రదర్శనలతో విసుగు తెప్పిస్తున్న ఆ జట్టు.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మరో రెండు రోజుల్లో టోర్నీ ఢిల్లీకి షిఫ్ట్ కాబోతున్న నేపథ్యంలో గుజరాత్‌కు బెంగళూరులో ఇదే ఆఖరి మ్యాచ్. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ సారథి బెత్ మూనీ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్‌కు రానుంది.
పాయింట్ల పట్టికలో గత సీజన్ మాదిరిగానే అట్టడుగున ఉన్న గుజరాత్‌కు ఈ సీజన్లో ఢిల్లీతో ఇదే తొలి మ్యాచ్. కాగా రెండో సీజన్లో భాగంగా ఆడిన తొలిమ్యాచ్‌లో ఓడినా తర్వాత పుంజుకున్న ఢిల్లీ.. వరుసగా రెండు మ్యాచ్‌లలో గెలిచి నేడు హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిస్తే అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. షఫాలీ వర్మ, మెగ్‌లానింగ్, అలీస్ క్యాప్సీలు మంచి టచ్‌లో ఉండగా రోడ్రిగ్స్ తడబడుతోంది. ఆల్ రౌండర్ మరిజన్నె కాప్ ఆ జట్టు విజయాలలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఢిల్లీలోకి అడుగుపెట్టాలని క్యాపిటల్స్ ప్రణాళికలు రచిస్తోంది.
తుది జట్లు : ఈ మ్యాచ్‌లో గుజరాత్, ఢిల్లీలు తలా రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. గుజరాత్ ఆటగాళ్లు హర్లీన్ డియెల్, స్నేహ్ రాణాలు ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఢిల్లీ టీమ్‌లో మరిజన్నె కాప్, మిన్ను మణిలు మిస్ అయ్యారు.
గుజరాత్ జెయింట్స్ : బెత్ మూనీ (కెప్టెన్), లారా వోల్వార్ట్డ్, వేదా కృష్ణమూర్తి, ఫొబె లిచ్‌ఫీల్డ్, ఆష్లే గార్డ్నర్, డయాలన్ హేమలత, క్యాథ్రిన్ బ్రైస్, తరన్నుమ్ పఠాన్, తనూజా కన్వర్, మన్నత్ కశ్యప్, మేఘనా సింగ్
ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలీస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లండ్, జెస్ జొనాసెన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా, టిటాస్ సాధు, శిఖా పాండే, రాధా యాదవ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

