WPL 2024 Final | ఫైనల్లో తేలిపోయిన ఢిల్లీ.. మొలినెక్స్, శ్రేయాంకల ధాటికి విలవిల.. ఆర్సీబీ ఎదుట ఈజీ టార్గెట్
WPL 2024 Final | తొలి సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్.. రెండో సీజన్ ఫైనల్లోనూ తడబడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న తుదిపోరులో మొదట బ్యాటింగ్ చేస్తున్న క్యాపిటల్స్.. ఆర్సీబీ స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడింది.
WPL 2024 Final | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్.. రెండో సీజన్ ఫైనల్లోనూ తడబడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న తుదిపోరులో మొదట బ్యాటింగ్ చేస్తున్న క్యాపిటల్స్.. ఆర్సీబీ స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడింది. 18.2 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీకి ఓపెనర్లు షఫాలీ వర్మ (27 బంతుల్లో 44, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), మెగ్ లానింగ్ (23 బంతుల్లో 23, 3 ఫోర్లు) మెరుపు ఆరంభమిచ్చినా ఆ తర్వాత ఆర్సీబీ స్పిన్నర్ల వలలో చిక్కుకున్నారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (4/12), సోఫీ మొలినెక్స్ (3/20), ఆశా శోభన (2/14)లు ఢిల్లీని కుదురుకోనీయలేదు.
శివమెత్తిన షఫాలీ..
ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. మొలినెక్స్ వేసిన రెండో ఓవర్లోనే భారీ సిక్సర్ బాదిన షఫాలీ వర్మ.. రేణుకా సింగ్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్లోనూ సిక్స్ కొట్టింది. ఈ ఓవర్లో లానింగ్ రెండు బౌండరీలు రాబట్టింది. పెర్రీ వేసిన ఐదో ఓవర్లో షఫాలీ 6, 4 బాదడంతో ఢిల్లీ స్కోరు 5 ఓవర్లకే 52 పరుగులకు చేరింది. ఏడు ఓవర్లు ముగిసేటప్పటికీ ఢిల్లీ స్కోరు 64-0గా ఉంది.
ఒకే ఓవర్లో మూడు వికెట్లు..
సాఫీగా సాగుతున్న ఢిల్లీ ఇన్నింగ్స్‌కు మొలినెక్స్ ఊహించని షాకిచ్చింది. ఒకే ఓవర్లో ఆమె మూడు కీలక వికెట్లు పడగొట్టడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. 8వ ఓవర్లో షఫాలీ వర్మను ఔట్ చేసిన ఆమె.. ఆ తర్వాత మూడు, నాలుగు బంతుల్లో రోడ్రిగ్స్, క్యాప్సీలను బౌల్డ్ చేసింది. దీంతో ఢిల్లీ స్కోరు వేగంతో పాటు వచ్చిన బ్యాటర్లు కూడా వచ్చినట్టే పెవిలియన్‌కు క్యూ కట్టారు.
Shafali Verma ✅
Jemimah Rodrigues ✅
Alice Capsey ✅That was one incredible 3⃣-wicket over from Sophie Molineux 👏 👏
Watch 🎥 🔽
Follow the match ▶️ https://t.co/g011cfzcFp #TATAWPL | #DCvRCB | #Final | @RCBTweets pic.twitter.com/a6gKyIFhtw
— Women’s Premier League (WPL) (@wplt20) March 17, 2024
శ్రేయాంక, శోభన మాయ..
ఢిల్లీ పతనానికి మొలినెక్స్ గట్టి పునాధి వేయగా ఆ తర్వాత పనిని యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ పూర్తిచేసింది. ఆమె వేసిన 11వ ఓవర్లో నాలుగో బంతికి మెగ్ లానింగ్ వికెట్ల ముందు దొరికిపోయింది. ఢిల్లీని ఆదుకుంటారని ఆశలు పెట్టుకున్న మరిజన్నె కాప్ (8)ను ఆశా శోభన 14వ ఓవర్లో పెవిలియన్‌కు పంపింది. ఇదే ఓవర్లో ఆమె జొనాసెన్ (3) ను కూడా ఔట్ చేసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బతీసింది. 15వ ఓవర్లో తొలి బంతికే శ్రేయాంక.. మిన్ను మణి (5)ని ఎల్బీగా వెనక్కి పంపింది.
Another one bites the dust!
Wicket No. 2⃣ for Shreyanka Patil 👏 👏
Follow the match ▶️ https://t.co/g011cfzcFp#TATAWPL | #DCvRCB | #Final | @RCBTweets pic.twitter.com/tECHULAh4U
— Women’s Premier League (WPL) (@wplt20) March 17, 2024
90 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. ఆర్సీబీ బౌలర్ల జోరు చూస్తే వంద పరుగులు అయినా చేస్తుందా..? అన్న అనుమానం కలిగింది. కానీ రాధా యాదవ్ (12) రెండు ఫోర్లు కొట్టి ఢిల్లీ స్కోరును వంద పరుగుల మార్కును దాటించింది. మరి ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదిస్తుందా..? అనేది ఆసక్తికరం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

