సురేఖ..ట్రిపుల్ ధమాకా

యాంక్టన్ (అమెరికా): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ దుమ్మురేపింది. అమెరికాలో జరుగుతున్న మెగాటోర్నీలో మూడు రజత పతకాలు కైవసం చేసుకొని అదుర్స్ అనిపించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్‌గా రికార్డుల్లోకెక్కింది. ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు రజతాలు చేజిక్కించుకోవడం సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌లో కాంపౌండ్ విభాగం లేకపోవడం కాస్త ఆసంతృప్తికరమైన విషయమే అయినా.. ప్రపంచ వేదికలపై నిలకడగా రాణిస్తుండటంతో ఆనందంగా ఉన్నా. ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కనపుడు చాలా బాధగా ఉంటుంది’ అని పోటీల అనంతరం సురేఖ చెప్పింది. శనివారం జరిగిన కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సురేఖ 144-146 పాయింట్ల తేడాతో సారా లోపెజ్ (కొలంబియా) చేతిలో ఓడింది.
అంతకుముందు మహిళల టీమ్ విభాగం ఫైనల్లో సురేఖ, ముస్కాన్, ప్రియతో కూడిన భారత జట్టు 224-229 పాయింట్ల తేడాతో కొలంబియా జట్టు చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచింది. మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ జంట 150-154తో సారా లోపెజ్-డానియల్ (కొలంబియా) చేతిలో ఓడి రజతం కైవసం చేసుకుంది. 2017లో టీమ్ విభాగంలో రజతం నెగ్గిన సురేఖ.. 2019లో టీమ్ ఈవెంట్‌తో పాటు వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించింది. తాజాగా మూడు రజతాలు నెగ్గడంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమె పతకాల సంఖ్య ఆరుకు చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

