షార్జా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లు విజృంభిస్తున్నారు. విండీస్ ఓపెనర్లు ఎల్విన్ లూయిస్ (6), క్రిస్ గేల్ (4)ను స్వల్పస్కోర్లకే వెనక్కు పంపి బంగ్లాకు అదిరే ఆరంభం అందించారు. ఆ తర్వాత షిమ్రాన్ హెట్మెయర్ (9) కూడా అవుట్ అవడంతో విండీస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. రోస్టన్ ఛేజ్ (27 నాటౌట్) ఫర్వాలేదనిపిస్తున్నాడు.
అతనికి కాసేపు సహకారం అందించిన కెప్టెన్ కీరన్ పొలార్డ్ (8) రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్ (0) రనౌట్ అయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి విండీస్ 70/4తో నిలిచింది. పరిస్థితిని చూస్తే విండీస్ జట్టు భారీ స్కోరు చేసే అవకాశాలేవీ కనిపించడం లేదు.