షార్జా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతున్నారు. 143 పరుగుల లక్ష్యఛేదనలో మొహమ్మద్ నయీమ్ (17)తో కలిసి ఓపెనింగ్ చేసిన షకీబల్ హసన్ (9) ఆకట్టుకోలేకపోయాడు. వికెట్ పడకుండా జాగ్రత్తపడినప్పటికీ ధాటిగా ఆడటంలో ఇద్దరూ సక్సెస్ కాలేదు.
ఆ తర్వాత కాసేపటికే రస్సెల్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి షకీబల్ పెవిలియన్ చేరాడు. నయీమ్ కూడా హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత లిటాన్ దాస్ (28 నాటౌట్), సౌమ్య సర్కార్ (17) కాసేపు నిలబడినా అకియల్ హొసేన్ బౌలింగ్‌లో సర్కార్ అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో దాస్తోపాటు ముష్ఫికర్ రహీమ్ క్రీజులో ఉన్నాడు.
ఫామ్‌లో ఉన్న రహీమ్ బ్యాట్ ఝుళిపిస్తే బంగ్లా గెలిచే అవకాశం ఉంది. అయితే మొదట్లో వచ్చిన బ్యాట్స్‌మెన్ అందరూ నిదానంగా ఆడటంతో 12 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లా జట్టు 80 పరుగులు మాత్రమే చేసింది.