Lionel Messi | ఫైనల్లో మెస్సీ కాలికి ఎర్రని రిబ్బన్.. ఆ రిబ్బన్ ఎందుకు కట్టుకున్నాడో తెలుసా..?
రమా పంటారొట్టోస్ అనే జర్నలిస్ట్ తల్లి ఆ రిబ్బన్ ఇచ్చింది
Lionel Messi : ఫ్రాన్స్‌తో ఉత్యంఠభరితంగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ పోరులో ఫైనల్లో అర్జెంటీనా 4-2తో గెలుపొందింది. లియోనల్ మెస్సీ రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తన వలర్డ్ కప్ కలను నెరవేర్చుకున్నాడు. వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో టీమ్‌తో కలిసి గెలుపు సంబురాలు చేసుకున్నాడు. వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని సహచరుడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ పోస్ట్ చేశాడు. అందులో అతడి ఎడమ కాలిమడమకు ఎర్రని రిబ్బన్ ఉంది. దాంతో అభిమానుల్లో ఆ రిబ్బన్ వెనకున్న కథేంటి? అనే ఆసక్తి మొదలైంది. అది నాలుగేళ్ల నాటి మెస్సీ లక్కీ రిబ్బన్. ఆ రిబ్బన్‌ను ఇంతకు అతనికి ఎవరు ఇచ్చారంటే..! అర్జెంటీనాకు చెందిన రమా పంటారొట్టోస్ అనే జర్నలిస్ట్ తల్లి ఇచ్చింది. ఫైనల్లో మెస్సీకి అదృష్టం కలిసి రావాలని ఆమె ఆ రిబ్బన్‌ను పంపింది.
ఎందుకంటే.. 2018 వరల్డ్ కప్‌లో ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ కొట్టిన పెనాల్టీ షూట్ మిస్ అయింది. దాంతో ఆ మ్యాచ్ 1-1తో టై అయింది. అప్పుడు తన తల్లి ఆ రిబ్బన్‌ను మెస్సీకి పంపించిందని రమ తెలిపాడు. అంతేకాదు తనకంటే ఆమెకు మెస్సీ అంటేనే ఎక్కువ ఇష్టమని అతడు చెప్పాడు. వరల్డ్ కప్ ఫైనల్లో మెస్సీ తొలి గోల్ అందించి జట్టులో ఉత్సాహం నింపాడు. ఎంబాబే హ్యాట్రిక్ గోల్స్ చేసి స్కోర్ సమం చేశాడు. అయితే పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-2తో విజేతగా నిలిచింది. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడిన మెస్సీ ఆటకు గుడ్ బై చెప్తారని అనుకున్నారంతా. కానీ, అతను మరికొన్ని రోజులు జట్టుతో కొనసాగనున్నాడు.
The best Messi video you’ll see today. pic.twitter.com/j4mk7Olfux
— J. (@Messilizer) December 20, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

