T20 World Cup | టీ20 ప్రపంచకప్లో టాప్ స్కోరర్ ఎవరంటే?
T20 World Cup | పొట్టి ప్రపంచకప్ ప్రారంభమైంది. పెద్ద జట్ల పోటీలకు కొంత సమయం ఉన్నా, కొత్త జట్ల మధ్య పోటీ నేటితో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ టీ20 ప్రపంచ కప్

దుబాయ్: టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. పెద్ద జట్ల పోటీలకు కొంత సమయం ఉన్నా, కొత్త జట్ల మధ్య పోటీ నేటితో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యథిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా? క్రిస్ గేల్, మ్యాక్స్వెల్, విరాట్ కోహ్లీ వంటి స్టార్లలో ఎవరు తొలి స్థానంలో ఉన్నారా? అని ఆలోచిస్తే తప్పులో కాలేసినట్లే.
ఎందుకంటే టీ20 చరిత్రలో అత్యంత ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడి రికార్డు శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరిట ఉంది. ఈ మాజీ క్రికెటర్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో 1,016 పరుగులు చేశాడు. అతని తర్వాతి స్థానంలో 920 పరుగులతో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. మూడు స్థానంలో మళ్లీ శ్రీలంక ఆటగాడే ఉన్నాడు. 897 పరుగులతో తిలకరత్నే దిల్షాన్ ఈ స్థానాన్ని ఆక్రమించాడు.

భారత తరఫున టీ20 ప్రపంచకప్లో అత్యథిక పరుగులు చేసింది మాత్రం విరాట్ కోహ్లీనే. ఇప్పటి వరకూ ఈ మెగా టోర్నీలో 16 ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ మొత్తమ్మీద 777 పరుగులు చేశాడు. కెప్టెన్గా ఇదే తన చివరి టీ20 వరల్డ్ కప్ అని ప్రకటించిన కోహ్లీ ఈసారి ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

