న్యూఢిల్లీ: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ గురించి షూటర్ మనూ భాకర్( Manu Bhaker) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. 15 ఏళ్ల వైభవ్ ఐపీఎల్లో దుమ్మురేపుతున్నాడు. భారీ షాట్లు కొడుతూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. అతను కాబోయే సూపర్‌స్టార్ క్రికెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ముగిసిన టీ20 అండర్ 19 వరల్డ్‌కప్‌లోనూ అతను రఫాడించిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలో జరుగుతున్న నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈవెంట్లో షూటర్ మనూ భాకర్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్న వేశారు. క్రికెటర్ సూర్యవంశీ గురించి ఆమెను అడిగారు. ఆ ప్రశ్నకు మనూ భాకర్ బదులిస్తూ.. ఒకవేళ మెంటర్షిప్ బాగుంటే, అతని చుట్టున్న వ్యక్తులు మంచివారైతే, అప్పుడు వయసు కేవలం సంఖ్య మాత్రమే అవుతుందని, ట్యాలెంట్‌కు వయసుతో సంబంధం లేదని ఆమె అన్నారు. 60 ఏళ్ల వయసూలోనూ, ఆరెళ్ల వయసూలోనూ గొప్ప సంఘటనలు జరుగుతాయని, అతని చుట్టున్న వ్యక్తులు అతనికి సరైన మార్గదర్శనం చేస్తే, అతన్ని గైడ్ చేస్తే , బహుశా అతనో పెద్ద స్టార్ అవుతారని ఆశిస్తున్నట్లు మనూ భాకర్ తెలిపారు.
షూటర్ మనూ భాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆన్లైన్లో స్పందనలు వస్తున్నాయి. కేకేఆర్ మాజీ టీం డైరెక్టర్ జోయ్ భట్టాచర్యా తన ట్వీట్లో ఆ ప్రశ్న అడిగిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. భాకర్ ఓ ఒలింపిక్ మెడలిస్ట్ అని, వైభవ్ గురించి ఏమనుకుంటున్నారని ఆమెను అడగడం సబబుగా లేదని, ఆమె సాధించిన ఘనతలను చులకన చేసినట్లు అవుతుందన్నారు. మనూ భాకర్ గురించి వైభవ్ అడగండి, అప్పుడు అతను ఇచ్చే లుక్స్ చూడండి అంటూ ఆయన కామెంట్ చేశారు. కొందరు ఆన్లైన్ యూజర్లు జర్నలిస్టు వేసిన ప్రశ్నను తప్పుపట్టారు. క్రికెటర్ల గురించి షూటర్లను ఎందుకు అడుగుతున్నారని కామెంట్ చేశారు.
షూటర్ మనూ భాకర్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నది. 10మీ పిస్తోల్ ఈవెంట్లో తొలుత, ఆ తర్వాత 10మీ పిస్తోల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రెండో కాంస్య పతకాన్ని భాకర్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన ఇండియన్ అథ్లెట్‌గా ఆమె ఘనత సాధించింది.
Folks, she is an Olympic medallist. To ask her what she thinks of Vaibhav Sooryavanshi is unfair on her achievements and her sports. Cricket anyway is the ruling passion of the country, your sports editors do not need another celebrity quote to spin a headline on Sooryavanshi.… https://t.co/Ha4RsO1rf8
— Joy Bhattacharjya (@joybhattacharj) April 27, 2026