Marlon Samuels | అవినీతి కేసులో దోషిగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్
Marlon Samuels : వెస్టిండీస్ మాజీ క్రికటెర్ మర్లోన్ శామ్యూల్స్(Marlon Samuels) అవినీతి కేసు (Corruption)లో దోషిగా తేలాడు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(Emirates Cricket Board) యాంటీ కరప్షన్ కోడ్(Anti-Corruption Code) ప్రకారం నాలుగు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు శామ్యూల్స్ అంగీకరించాడు. 2021 సెప్టెంబర్‌లో ఈ స్టార్ క్రికెటర్‌పై అవినీతి ఆరోపణలు...
Marlon Samuels : వెస్టిండీస్ మాజీ క్రికటెర్ మర్లోన్ శామ్యూల్స్(Marlon Samuels) అవినీతి కేసు (Corruption)లో దోషిగా తేలాడు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(Emirates Cricket Board) యాంటీ కరప్షన్ కోడ్(Anti-Corruption Code) ప్రకారం నాలుగు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు శామ్యూల్స్ అంగీకరించాడు. 2021 సెప్టెంబర్‌లో ఈ స్టార్ క్రికెటర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఐసీసీ కేసు నమోదు చేసింది. రెండేళ్ల తర్వాత ఈ విండీస్ మాజీ ఆటగాడు తన నేరాన్ని కోర్టు సమక్షంలో ఒప్పుకున్నాడు. అతడికి ఎలాంటి శిక్ష వేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది.
రెండేళ్ల క్రితం ఈ ఆల్‌రౌండర్ తనకు వస్తు, ధన రూపంలో ముట్టిన కానుకల గురించి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చెప్పలేదు. తాను బస చేసిన హోటల్ బిల్లు 750 అమెరికా డాలర్లు అంటే రూ. 62,362కు సంబంధించిన పేపర్‌ను దాచిపెట్టాడు. అంతేకాదు కేసు విచారణ చేపట్టిన అధికారులకు సహకరించలేదు. పైగా విచారణ ఆలస్యానికి కారణమయ్యాడు. గతంలోనూ శామ్యూల్స్ ఇదే తరహా ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. 2007లో మ్యాచ్ సమాచారాన్ని ఆన్లైన్ స్పోర్ట్స్‌బుక్ వాళ్లకు చెప్పాడు.
మర్లోన్ శామ్యూల్స్

విండీస్ గొప్ప క్రికెటర్లలో ఒకడైన శామ్యూల్స్ 18 ఏళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడాడు. శామ్యూల్స్ రెండు సార్లు టీ20 ప్రపంచ కప్(T20 World Cup) గెలిచిన జట్టులో సభ్యుడు. 2012, 2016లో కరీబియన్ జట్టు పొట్టి ప్రపంచ కప్ గెలవడంలో శామ్యూల్స్ కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20ల్లో కలిపి 11,134 పరుగులు చేశాడు. బంతితోనూ రాణించి 152 వికెట్లు తీశాడు.
ఇవి కూడా చదవండి
Asia cup | ఓసారి టీ20, ఓసారి వన్డే ఫార్మాట్.. ఆసియా కప్‌లో ఏంటీ గందరగోళం!
Prithvi Shaw | నార్తంప్టన్‌షైర్ జట్టుకు ఎదురుదెబ్బ.. మిగతా మ్యాచ్‌లకు పృథ్వీ షా దూరం..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

