WIW vs IREW : మహిళల టీ20 ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొడుతోంది వెస్టిండీస్. గ్రూప్ బీ నుంచి సెమీస్ రేసులో నిలిచిన విండీస్ విజయంతో బెర్తు పట్టేయాలనుకుంటోంది. టాస్ గెలిచిన ఐరిష్ కెప్టె్న్ గబీ లెవిస్ బౌలింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ బాదేసి ప్రత్యర్థిని తక్కువకే ఆలౌట్ చేయడంపై విండీస్ దృష్టి సారించనుంది.
హ్యాట్రిక్ విజయాలతో సెమీస్‌కు చేరువైన వెస్టిండీస్‌కు ఇంగ్లండ్ షాకిచ్చింది. 38 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమితో రెండో స్థానంలో కొనసాగుతున్న కరీబియన్ జట్టుకు ఐర్లాండ్‌ను ఓటించడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ గెలిస్తే 8 పాయింట్లతో నాకౌట్‌కు దూసుకెళ్తుంది.
ఐర్లాండ్ తుది జట్టు : అమీ హంటర్(వికెట్ కీపర్), గబీ లెవిస్(కెప్టెన్), ఒర్లా ప్రెండెర్‌గాస్ట్, రెబెక్కా స్టాక్‌వెల్, లీహ్ పౌల్, అలిసే టెక్టర్, లూయిస్ లిటిల్, అర్లెనె కెల్లీ, ఐమీ మగురీ, కార ముర్రే, జనే మగురీ.
వెస్టిండీస్ తుది జట్టు : హీలీ మాథ్యూస్(కెప్టెన్), క్వియానా జోసెఫ్, షెమైనే క్యాంప్‌బెల్(వికెట్ కీపర్), స్టాఫానీ టేలర్, డియాండ్ర డాటిన్, చినెల్లె హెన్రీ, జహజర క్లాక్స్టన్, జన్నిల్లీ గ్లాస్గో, అలియా అలీనా, అఫీ ఫ్లెచర్, అష్మిని మునిసర్.