దోహా : ఐడబ్ల్యూఎఫ్ గ్రాండ్ ప్రి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలలో భారత్ కు చెందిన కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత బింద్యారాణి దేవి క్లీన్ అండ్ జర్క్ విభాగంలో బరువునెత్తడంలో విఫలమయింది. 55కి. విభాగంలో తలపడిన బింద్యారాణి మూడు ప్రయత్నాలలో ఏ ఒక్కదానిలో సఫలం కాలేకపోయింది. దీనితో ఆమె ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు. స్నాచ్‌లో మాత్రమే బింద్యారాణి రెండుసార్లు బరువును ఎత్తగలిగింది. 106 కిలోల బరువు ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమైన బింద్యారాణి మరో రెండుసార్లు 109 కిలోలను ఎత్తేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.