జింజు (కొరియా): భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు ఆసియా చాంపియన్‌షిప్‌లో నిరాశ ఎదురైంది. ఆసియా టోర్నీలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 49 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన మీరాబాయి స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలతో మొత్తం 194 కిలోల బరువెత్తింది. ఆ
సియా(2021) టోర్నీలో కాంస్యం నెగ్గిన చాను ఈ సారి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. జియాంగ్ (207 కేజీలు), హో జిహుయి (204 కేజీలు), సెరోడ్చనా (200 కేజీలు) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.