David Warner : తాగిన మత్తులో కారు నడిపినందుకు చాలా బాధ పడుతున్నాని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అన్నాడు. ఈస్టర్ ఆదివారం రోజున మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి సిడ్నీలో పోలీసులకు దొరికిన డేవిడ్ భాయ్.. కోర్టులో హాజరైన అనంతరం పశ్చాత్తాపం చెందుతున్నట్టు తెలిపాడు. మద్యం సేవించిన అనంతరం కారు తీయకుండా ఉబెర్‌లో వెళ్లాల్సింది అని వార్నర్ తన న్యాయవాది ద్వారా మీడియాకు తెలియజేశాడు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టైన వార్నర్ గురువారం కోర్టుకు హాజరయ్యాడు. ఈ సందర్బంగా వార్నర్ న్యాయవాది బాబీ హిల్ మీడియాతో మాట్లాడుతూ.. వార్నర్ తన తప్పును అంగీకరించాడని, వచ్చే వాయిదాలో క్షమాపణకు దరఖాస్తు చేసుకుంటాడని వెల్లడించాడు.
David Warner will “accept responsibility” for drink-driving, his lawyer told reporters after a Sydney court hearing.
The 39-year-old cricketer faces a “middle-range” drink-driving charge after allegedly being more than twice the legal limit in April.
READ:… pic.twitter.com/1Ckv2Xyq2T
— Sportstar (@sportstarweb) May 7, 2026
‘తాను ఏం తప్పు చేశాడో వార్నర్‌కు తెలుసు. తాను నిర్లక్ష్యగా ప్రవర్తించానని, తాగిన తర్వాత కారు తీయకుండా ఉబెర్ క్యాబ్‌లో వెళ్లాల్సింది అని అతడు బాధ పడుతున్నాడు. ఆరోజు ఈస్టర్.. ఆదివారం కావడంతో స్నేహితుడి ఇంట్లో మూడు గ్లాసుల వైన్ తాగినట్టు వార్నర్ చెప్పాడు. దేవుడు తిరిగొచ్చిన ఆ రోజు గ్లాసెడు వైన్ తాగడం తప్పేమీ కాదు. కానీ, తాగిన మత్తులో కారు నడపడం పెద్ద తప్పు. అలాకాకుండా తాను ప్లాన్ బీని ఎంచుకుంటే బాగుండేది అని వార్నర్ వాపోతున్నాడు.. అయితే.. పోలీసులు చెక్ చేయడానికి 11 నిమిషాల ముందే అతడు వైన్ తాగాడు. అయితే.. రెండో టెస్టుకు 52 నిమిషాలు ఆలస్యమైంది’ అని అతడి న్యాయవాది చెప్పాడు.

అసలేం జరిగిందంటే.. సిడ్నీలోని మరౌబ్రాలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులను గమనించిన వార్నర్ టెస్టు తప్పించుకోవడం కోసం కొంత దూరంలో తన కారును పార్క్ చేశాడు. వార్నర్ కారు ఆపడం చూసిన పోలీసులు అతడి దగ్గరికే వెళ్లి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్ట్ చేశారు. ఇంకేముంది శ్వాస పరీక్షలో మనోడు గట్టిగానే ఆల్కహాల్ తీసుకున్నట్టు తేలింది. చట్టప్రకారం ఉండాల్సిన దానికంటే రెండింతలు (0.104) ఎక్కువ ఆల్కహాల్ శాతం ఉందని, అందుకే వార్నర్‌ను అరెస్ట్ చేశామని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తమ నివేదికలో వెల్లడించారు. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన వార్నర్… ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నాడు.