Brian Lara: బ్రియాన్ లారా పుస్తకం వివాదాస్పదం.. క్షమాపణలు కోరిన రిచర్డ్స్, హూపర్
Brian Lara: మాజీ క్రికెటర్లు రిచర్డ్స్, హూపర్ గురించి బ్రియాన్ లారా తన పుస్తకంలో రాసిన కామెంట్లపై విమర్శలు వచ్చాయి. రిచర్డ్స్ తనను, హూపర్‌ను ఏడ్పించినట్లు ఆ బుక్లోపేర్కొన్నాడు. దీన్ని రిచర్డ్స్, హూపర్ తప్పుపట్టారు. క్షమాపణలు చెప్పాలని ఆ ఇద్దరూ కోరారు.
జార్జ్‌టౌన్: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా వివాదంలో ఇరుక్కున్నాడు. తాజాగా అతను రాసిన పుస్తకంపై విమర్శలు వచ్చాయి. లారా: ద ఇంగ్లండ్ క్రానికల్స్ అనే పుస్తకాన్ని లారా రాశాడు. దాంట్లో మాజీ దిగ్గజ క్రికెటర్లు వివియన్ రిచర్డ్స్, కార్ల్ హూపర్ గురించి .. కొన్ని కామెంట్లు చేశాడు. దీంతో ఆ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు లారా నుంచి క్షమాపణలు కోరారు. విండీస్ జట్టులోని క్రికెటర్లను రిచర్డ్స్ భయపెట్టేవాడని, ప్రతి కొన్ని వారాలకు ఒకసారి తనను ఏడిపించేవాడు అని లారా తన పుస్తకంలో రాశాడు. తననే కాకుండా కార్ల్ హూపర్‌ను కూడా రిచర్డ్స్ ఏడిపించేవాడు అని బుక్‌లో పేర్కొన్నాడు. వారానికి ఒకసారైనా హూపర్‌ను ఏడ్చేలా చేసేవాడని లారా తన బుక్‌లో తెలిపాడు.
లారా రాసిన బుక్‌పై ఇప్పుడు ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు కోపంమీదున్నారు. ఇద్దరూ జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. బుక్‌లో రాసిన అంశాల గురించి రిచర్డ్స్, హూపర్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పుగా తమ గురించి ఆ బుక్‌లో రాసినట్లు పేర్కొన్నారు. ఆటగాళ్ల మధ్య ఉన్న రిలేషన్‌ను తప్పుపట్టేలా ఆ బుక్ ఉన్నట్లు ఆరోపించారు. బ్రియాన్ లారా తమకు క్షమాపణలు చెప్పాలని ఆ ఇద్దరూ డిమాండ్ చేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

