ధోనీకి తనదైన స్టైల్లో వెరైటీగా బర్త్‌డే విషెస్ చెప్పిన సెహ్వాగ్

న్యూఢిల్లీ: ఇండియన్ టీమ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు చమత్కారం కాస్త ఎక్కువే. క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత ట్విటర్లో అతడు చేస్తున్న ఫన్నీ ట్వీట్లు వీరూకి మరింత మంది అభిమానులను సంపాదించిపెట్టాయి. తాజాగా బుధవారం ధోనీ బర్త్ డే సందర్భంగా అతడు తనదైన స్టైల్లో విషెస్ చెప్పాడు. వరుసగా ఆరు ట్వీట్లు చేసిన సెహ్వాగ్.. ఒక్కోదాంట్లో ఒక్కో స్టైల్లో ధోనీకి విష్ చేయడం విశేషం. మహేంద్ర అంటే ఆకాశానికి దేవుడు అని అర్థం. తన భారీ షాట్లతో ఆ ఆకాశాన్ని ఆనందపరిచిన ధోనీ.. ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించి ఇటు భూమినీ పరవశింపజేశాడు అని వీరూ తన తొలి ట్వీట్లో ప్రశంసలు కురిపించాడు.
ఇక 2016 నుంచి తాను ధోనీకి ట్విటర్లో చెబుతున్న విషెస్‌కు సంబంధించిన ట్వీట్లన్నింటినీ వీరూ పోస్ట్ చేశాడు. 2016లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ధోనీ అని ట్వీట్ చేసిన సెహ్వాగ్.. 2017లో నీ హెలికాప్టర్ షాట్ ఇలాగే ఎగురుతూ మా గుండెల్లో ల్యాండవ్వాలని విష్ చేశాడు. 2018లో స్టంపింగ్‌ను తప్పించుకోవడానికి దూరం నుంచి కాలు క్రీజులో పెడుతున్న ధోనీ ఫొటోను షేర్ చేస్తూ.. నీ జీవితం ఈ స్ట్రెచ్ కన్నా పెద్దగా ఉండాలని కోరుకున్నాడు. 2019లో ధోనీకి ఇష్టమైన నంబర్ 7 గురించి చెబుతూ పోస్ట్ చేశాడు.
Mahendra – meaning Lord of the Sky.
— Virrender Sehwag (@virendersehwag) July 7, 2021
Certainly pleased the skies with his big hitting when he bust onto the scene and then by earning the love of so many people on earth pleased the earth as well. Once in a generation player , #HappyBirthdayMSDhoni pic.twitter.com/COuu9X2s6L
— Virrender Sehwag (@virendersehwag) July 7, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

