ఢిల్లీ : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లినందుకు గాను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి డబ్బులు ముట్టాయన్న ఆరోపణలను అతడి ప్రతినిధి బృందం ఖండించింది. గతంలో పలుమార్లు కోహ్లీ ఉత్తరప్రదేశ్లో ఉన్న బృందావన్ ఆశ్రమానికి వెళ్లాడు. మొదటిసారిగా 2023లో ఈ ఆశ్రమాన్ని సందర్శించాడు.
అయితే తొలిసారి ఇక్కడకు వచ్చినందుకు గాను కోహ్లీకి ఆశ్రమం నుంచి రూ. 5 కోట్లు అందాయని ఆరోపిస్తూ శ్రీ కృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ అధ్యక్షుడు ఫలహారి మహారాజ్ వ్యాఖ్యానించడంతో దుమారం రేగింది. ఈ ఆరోపణలను కోహ్లీ అధికార ప్రతినిధి బృంద ఖండించింది.‘ఫలహారి మహారాజ్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాదారమైనవి. ప్రేమానంద మీదున్న విశ్వాసం, ఆయన మీదున్న గౌరవంతోనే కోహ్లీ అక్కడికి వెళ్లారు’ అని స్పష్టం చేసింది.