Virat Kohli | కోహ్లీ చేతిపై కొత్త పచ్చబొట్టు.. ఐదు సెషన్లు దాటినా పూర్తవ్వలే..!
Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డులే కాదు.. అతడి ఒంటిపై ఉన్న టాటూ (Tattoo)లు కూడా ప్రత్యేకమే. ఇప్పటికే అతడి శరీరంపై 11 పచ్చబొట్లు ఉండగా.. తాజాగా మరో టాటూకు సిద్ధమయ్యాడు విరాట్.
Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డులే కాదు.. అతడి ఒంటిపై ఉన్న టాటూ(Tattoo)లు కూడా ప్రత్యేకమే. ఇప్పటికే అతడి శరీరంపై 11 పచ్చబొట్లు ఉండగా.. తాజాగా మరో టాటూకు సిద్ధమయ్యాడు విరాట్. ఇందుకోసం ఏకంగా ఐదు సెషన్లు కేటాయించాడీ స్టార్ బ్యాటర్. అయినా సరే ఆ టాట్టూ పూర్తి కాలేదు. త్వరలోనే వెస్టిండీస్ పర్యటనకు ముందు అతడు వేయించుకుంటున్న ఈ పచ్చబొట్టులో ఏం విషయం దాగుందోనని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
క్రికెటర్లు, ఫుట్బాల్ ప్లేయర్ల ఒంటిపై పచ్చబొట్లు కొత్తేమి కాదు. తమ కెరీర్లోని మధుర క్షణాలు, తమ రికార్డులు.. వరల్డ్ కప్ ట్రోఫీని టాటూగా వేయించుకునేవాళ్లు చాలామందే. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా టాట్టూ లవరే. ఇప్పటికే అతడి శరీరంపై 11 పచ్చబొట్లు ఉన్నాయి. ఇప్పుడు మరో టాట్టూతో అభిమానుల్లో ఆసక్తి రేపాడీ రన్ మెషీన్. ఎడమ చేతిపై టాటూ కోసం ఏకంగా ఐదు సెషన్లు కేటాయించాడు. అయినా సరే ఇంకా పూర్తి కాలేదు.
ఇంతకూ అది ఏంటో తెలుసా.. నీటి బొట్టు తరంగాలను ప్రతిబింబించే టాట్టూ. నీటి బొట్టు పడినప్పుడు ఏర్పడే వలయాలను కోహ్లీ చేతిపై ఎంతో నేర్పుగా, ఓపికగా వేస్తున్నాడు అలెన్స్ స్టూడియోస్ ఆర్టిస్ట్. అయితే.. తాను కొత్త టాటూ వేయించుకుంటున్న విషయాన్ని టీమిండియా స్టార్ మాత్రం బహిరంగంగా వెల్లడించలేదు.
ఇటీవలే.. ఇంగ్లండ్పై లార్డ్స్ వన్డేలో అర్ధ శతకంతో మెరిసిన కోహ్లీ.. వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతున్నాడు. వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న అతడు.. కరీబియన్ గడ్డపై తన స్టయిల్లో చెలరేగాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి 50 ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న 37 ఏళ్ల కోహ్లీ ఖాతాలో 54 సెంచరీలు, 79 అర్ధ శతకాలు ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

