Virat Kohli – Yashasvi | ఐపీఎల్ స్టార్‌కు కోహ్లీ బ్యాటింగ్ టిప్స్.. వీడియో వైరల్
Virat Kohli - Yashasvi : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023) కోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్ వెళ్లారు. మ్యాచ్ ప్రారంభానికి మరో ఆరు రోజులు ఉండడంతో నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ 16వ సీజన్లో దంచికొట్టిన యశస్వీ జైస్వాల్( Yashasvi Jaiswal)కు విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్ టిప్స్ చెప్పాడు. బ్యాటింగ్ పొజిషన్ ఇలా...
Virat Kohli – Yashasvi : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023) కోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్ వెళ్లారు. మ్యాచ్ ప్రారంభానికి మరో ఆరు రోజులు ఉండడంతో నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ 16వ సీజన్లో దంచికొట్టిన యశస్వీ జైస్వాల్( Yashasvi Jaiswal)కు విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్ టిప్స్ చెప్పాడు.
బ్యాటింగ్ పొజిషన్ ఇలా ఉండాలి? అంటూ కోహ్లీ అతడికి వివరించాడు. విరాట్ చెప్తుంటే యశస్వీ ఆసక్తిగా విన్నాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతోంది. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. పెళ్లి కారణంగా గైక్వాడ్ అందుబాటులో లేకపోవడంతో యశస్వీని అదృష్టం వరిచింది.
తొలి మ్యాచ్‌లోనే ఫిఫ్టీ
16వ సీజన్ తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)పై యశస్వీ అర్ద శతకంతో మెరిశాడు. అదే ఫామ్ కొనసాగించిన ఈ యంగ్‌స్టర్ రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభాలు ఇచ్చాడు. ముంబై ఇండియన్స్‌పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అతను ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై యశస్వీ విశ్వరూపం చూపించాడు. కేవలం 13 బంతుల్లోనే ఫోర్లు, సిక్స్‌లతో ఫిఫ్టీ కొట్టాడు. అత్యధిక పరుగులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన యశస్వీ

టెస్టు గదపై గురి
వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన భారత్ టెస్టు గదపై గురి పెట్టింది. ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా జూన్ 7 -11 తేదీల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు చాంపియన్‌షిప్ జరగనుంది. 2021లో ఫైనల్ చేరిన భారత్ ఆఖరి మెట్టుపై భంగపడింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. తొలిసారి ఫైనల్ చేరిన ఆసీస్ కూడా విజయంపై కన్నేసింది. స్వదేశంలో జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో 4-2తో కంగారులను చిత్తు చేసిన రోహిత్ సేన అదే ఫలితాన్ని పునరావృతం చేస్తుందా? లేదా? అనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది.
ఇవి కూడా చదవండి
Engalnd Crickter Josh Tongue | స్నేహితుడి కొడుకు క్రికెటర్ అవుతాడని పందెం కాసి.. రూ. 50 లక్షలు గెలిచిండు
Shubhman Gill | స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం.. చిన్నప్పుడు చూసిన సూపర్ హీరో సినిమా అదే : శుభ్‌మన్ గిల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- England
- oval
- Virat Kohli
- wtc 2023
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

