Vinícius Junior : అవమానాలు, ఛీత్కారాలు మనిషిని రాటుదేల్చుతాయి. ఛీకొట్టిన జనం చేతనే శభాష్ అనిపించుకోవాలనే కసిని పెంచుతాయి. అవరోధాలను దాటిన ప్రతి విజేత కథలో ఇవి మామూలే. ప్రస్తుతం ఫిఫా వరల్డ్‌కప్‌లో మెరుస్తున్న వినిసియస్ జూనియర్ (Vinícius Junior) ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పచ్చు. మూడేళ్ల క్రితం నల్లజాతీయుడిగా వివక్షను ఎదుర్కొన్న ఈ కుర్రాడు.. ఇప్పుడు సాకర్ ప్రపంచాన్ని తన ఆటతో మంత్రముగ్దులను చేస్తున్నాడు. బ్రెజిల్ తరఫున ప్రతి మ్యాచ్‌లో గోల్ కొట్టిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడీ ఫార్వర్డ్.
తిట్టిననోళ్లతోనే పొగిడించుకోవాలంటే మాటలు కాదు చేతలు కావాలి. ఫుట్‌బాలే ప్రపంచంగా భావించే వినిసియస్ జూనియర్ అదే చేశాడు. మూడేళ్ల క్రితం తనపై జాతి వివక్ష చూపిన వారికి రంగు కాదు.. ప్రతిభ ఉండాలి అని చెబుతూ.. ప్రపంచకప్ 2026లో గోల్స్‌తో చెలరేగిపోతున్నాడు. స్టార్ ప్లేయర్ నెమ్మర్ గైర్హాజరీలో బ్రెజిల్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన వినిసియస్.. ప్రతి మ్యాచ్‌లో గోల్ కొట్టాడు.
Scotland 0 – [1] Brazil – Vinícius Junior 7′ pic.twitter.com/h8uAe5fTbj
— Goal Rush GIF (@GoalRushGIF) June 24, 2026
తద్వారా గత 24 ఏళ్లలో ప్రపంచకప్ ప్రతి మ్యాచ్‌లో గోల్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడీ ఫార్వర్డ్ ప్లేయర్. 2002లో రొనాల్డో నజారియో, రివాల్డోలు గ్రూప్ మ్యాచ్‌లో గోల్స్ చేశారు. టర్కీ, చైనా, కోస్టారికాను ఓడించిన బ్రెజిల్.. నాకౌట్లోనూ పంజా విసిరి ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
ఫిఫా వరల్డ్‌కప్ గ్రూఏ మొదటి మూడు మ్యాచుల్లో గోల్స్ చేసిన ఐదో ఆటగాడిగా వినిసియస్ జూనియర్ మరో రికార్డు సాధించాడు. 1970లో జైర్జిన్హో, 1994లో రొమారియో, 2002లో రొనాల్డో, రివాల్డోలు.. తొలి మూడు మ్యాచుల్లో గోల్స్‌తో బ్రెజిల్ విజయాల్లో కీలకమయ్యారు. 2026 ఎడిషన్‌లో గొప్పగా ఆడుతున్న వినిసియస్.. మొరాకోపై గోల్‌తో బ్రెజిల్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అనంతరం.. హైతీపై 3-0, స్కాట్లాండ్పై 3-0 విజయంలోనూ ఈ ఫార్వర్డ్ గోల్ ఉంది.
Vinícius Júnior mencetak dua gol saat Brazil national football team menang 3-0 atas Scotland national football team, memastikan Brasil lolos ke babak gugur 2026 FIFA World Cup. Viní juga kini mengoleksi empat gol dari tiga laga dan masuk dalam persaingan top skor turnamen. pic.twitter.com/22TjE552gB
— IDXLINE (@idxlinehoki) June 26, 2026
ఫుట్‌బాల్ మైదానంలో ఆటే కాదు చర్మం రంగూ ముఖ్యమే. ఈ జాతి వివక్ష(Racism) కారణంగా వినిసియస్ జూనియర్ అవమానాలు పడ్డాడు. మూడేళ్ల క్రితం మే 22న రియల్ మాడ్రిడ్(Real Madrid)కు ఆడిన అతడిని కొందరు అభిమానులు హేళన చేశారు. నల్లజాతీయుడైన అతడిపై కొందరు జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. వలెన్సియాతో మ్యాచ్ జరుగుతుండగా అతడిని టార్గెట్ చేసిన ల లిగా క్లబ్ ఫ్యాన్స్ కొందరు మొ*నో.. మొ*నో అంటూ అరిచారు. స్పానిష్ భాషలో మొ*నో అంటే ‘మంకీ’ అని అర్థం. వినిసియస్ను వాళ్లు ‘మంకీ.. మంకీ’ అని మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు.
eu n gosto do vini jr, mas isso aqui é lamentável. Os ataques racistas que o vini já sofreu é triste demais. Ele não merece isso, ninguém merece! pic.twitter.com/2trzSGS4ET
— Gi Dorough Carter🐝 (@giovannaDorough) June 20, 2026
రేసిజానికి గురైన వినిసియస్ జూనియర్‌కు ఫుట్‌బాల్ ఆటగాళ్లు మద్దతు తెలుపుతున్నారు. స్టార్ ప్లేయర్ కైలీ ఎంబాపే (Kylian Mbappé) ‘నువ్వు ఒంటరివి కాదు. మేమంతా నీతో ఉన్నాం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ల లిగా క్లబ్ ఫ్యాన్స్‌పై వినిసియస్ పోస్ట్ పెట్టాడు. అందులో.. ‘లా లిగా ఒకప్పుడు రొనాల్డో, మెస్సీ వంటి ఆటగాళ్లకు ప్రసిద్ధి. కానీ, ఇప్పుడు రేసిజానికి కేంద్రంగా ఉంది’ కౌంటర్ ఇచ్చాడు.