Venkatesh Iyer | ఐపీఎల్ విజేత పెండ్లి మురిపెం.. కొత్త జంట ఫొటోలు వైరల్
Venkatesh Iyer : ఐపీఎల్ విజేత వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) పెండ్లి చేసుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఆటగాడైన అయ్యర్ తన ఫియాన్సీ శృతి రఘునాథన్ (Shruthi Raghunathan)ని భారతీయ సంప్రదాయం ప్రకారం మనువాడాడు.
Venkatesh Iyer : ఐపీఎల్ విజేత వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer) పెండ్లి చేసుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఆటగాడైన అయ్యర్ తన ఫియాన్సీ శృతి రఘునాథన్(Shruthi Raghunathan)ని భారతీయ సంప్రదాయం ప్రకారం మనువాడాడు. వీళ్లకు నిరుడు నవంబర్లోనే నిశ్చితార్థం జరుగగా.. ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు. ఈ ఇద్దరి వివాహ తంతు అంగరంగ వైభవంగా సాగింది.
నవ వధువు శృతి నీలం రంగు చీరలో మెరిసిపోగా.. అయ్యర్ సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశాడు. ఈ కొత్త జంట దండలు మార్చుకున్న ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే శృతి, వెంకీల పెండ్లి ఫొటోలను రెండు లక్షల మందికిపైగా చూశారు. కర్నాటకకు చెందిన శృతి బీ.కామ్ పూర్తయ్యాక నిఫ్ట్(NIFT)లో ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చదివింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో లైఫ్‌స్టయిల్ ఇంటర్నేషనల్ కంపెనీకి మర్చండైస్ ప్లానర్‌గా సేవలందిస్తోంది.
ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చి టీమిండియా జెర్సీ(Team India Jersey) వేసుకున్న క్రికెటర్లలో అయ్యర్ ఒకడు. 2021 సీజన్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ రెచ్చిపోయి ఆడాడు. 10 మ్యాచుల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేసి భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆల్‌రౌండర్‌గానూ అదరగొట్టే అయ్యర్ ఇప్పటివరకూ భారత జట్టు తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడాడు.

ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన వెంకీ.. పదిహేడో సీజన్లో చితక్కొట్టాడు. మిడిలార్డర్లో కోల్‌కతా ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. 14 మ్యాచుల్లో 158 స్ట్రయిక్ రేటుతో 370 రన్స్ కొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగిన ఫైనల్లో అయ్యర్ మెరపు హాఫ్ సెంచరీతో కోల్‌కతాను గెలిపించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

