Vaibhav Sooryavanshi | 15 ఏళ్లకే టీమిండియా జెర్సీ ధరించబోతున్నాడా?.. వైభవ్ పోస్ట్‌తో డెబ్యూపై జోరుగా ఊహాగానాలు
Vaibhav Sooryavanshi | భారత క్రికెట్లో మరో అరుదైన ఘట్టానికి వేదిక సిద్ధమైనట్లు కనిపిస్తోంది. భారత్–ఇంగ్లాండ్ మధ్య బుధవారం (జూలై 1) జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ అతడు తుది జట్టులో చోటు దక్కించుకుంటే, కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
Vaibhav Sooryavanshi | భారత క్రికెట్లో మరో అరుదైన ఘట్టానికి వేదిక సిద్ధమైనట్లు కనిపిస్తోంది. భారత్–ఇంగ్లాండ్ మధ్య బుధవారం (జూలై 1) జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ అతడు తుది జట్టులో చోటు దక్కించుకుంటే, కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఓపెనర్‌గా నిలకడగా రాణిస్తూ మొత్తం 776 పరుగులు సాధించి సెలెక్టర్లను మెప్పించాడు. అతని ప్రదర్శనకు గుర్తింపుగా భారత టీ20 జట్టులో చోటు దక్కింది.
అయితే, ఇటీవల జరిగిన ఐర్లాండ్ పర్యటనలో రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ అతడికి తుది జట్టులో అవకాశం లభించలేదు. ఆ సిరీస్‌లో భారత్ ఓటములు చవిచూడడంతో, వైభవ్‌ను ఆడించకపోవడంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు టీమ్ మేనేజ్మెంట్ను విమర్శించారు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి ముందు జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వైభవ్ డెబ్యూ గురించి పలుమార్లు ప్రశ్నించారు. అయితే తుది జట్టుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ఆయన సమాధానం ఇవ్వడంతో, తొలి మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం దక్కకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు నిరాశ వ్యక్తం చేయగా, యువ ఆటగాళ్లకు తగిన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు, మ్యాచ్‌కు ముందే తుది జట్టును వెల్లడించడం భారత జట్టులో సాధారణంగా జరగదని, అందుకే కెప్టెన్ వివరాలు వెల్లడించలేదని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే మంగళవారం రాత్రి వైభవ్ సూర్యవంశీ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపింది. ఇంగ్లాండ్ టూర్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్న అతడు, “Grateful” అని క్యాప్షన్ రాసి దానికి ఇసుక గడియారం (Hourglass) ఎమోజీని జత చేశాడు. ఈ పోస్ట్‌ను చూసిన అభిమానులు, “ఏదో ప్రత్యేకమైన విషయం జరగబోతోందనే సంకేతమా?” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు దీనిని అతని అంతర్జాతీయ అరంగేట్రానికి సంబంధించిన సూచనగా భావిస్తుండగా, మరికొందరు ఇది కేవలం సాధారణ పోస్ట్ మాత్రమే కావచ్చని అంటున్నారు. అయితే ఈ పోస్టు అర్థంపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. కాగా, వైభవ్ సూర్యవంశీ తొలి టీ20లో ఆడతాడా లేదా అనే ప్రశ్నకు సమాధానం మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలోనే లభించనుంది. ఒకవేళ అతడు తుది జట్టులో చోటు దక్కించుకుంటే, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆటగాడిగా అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- cricket
- Cricketers
- debut
- England
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

