Vaibhav Sooryavanshi | నేను వికెట్లు తీస్తానని కెప్టెన్‌కు తెలియదు.. ఆరోజు భయపడుతూనే బంతి ఇచ్చాడు..!
Vaibhav Sooryavanshi : విధ్వంసక ఆటకు కేరాఫైన పదిహేనేళ్ల వైభవ్.. నాలుగు బంతుల్లోనే 2 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. 'నేనూ వికెట్లు తీయగలను అని మా కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు తెలియదు. ' అని పేర్కొన్నాడీ యువ సంచలనం.
Vaibhav Sooryavanshi : క్రీజులోకి వస్తూనే బౌలర్లపై ఎడాపెడా సిక్సర్లతో విరుచుకుపడే వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) బంతితోనూ ఆకట్టుకుంటున్నాడు. దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో ఈ కుర్రాడు తన ఆఫ్ స్పిన్ నైపుణ్యం చూపించాడు. విధ్వంసక ఆటకు కేరాఫైన పదిహేనేళ్ల వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్ జట్టుపై నాలుగు బంతుల్లోనే 2 వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు. తమ జట్టు సెమీస్ చేరడంలో కీలకమైన అతడు ‘నేనూ వికెట్లు తీయగలను అని మా కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు తెలియదు. ‘ అని పేర్కొన్నాడీ యువ సంచలనం.
జింబాబ్వే పర్యటనలో మెరిసిన వైభవ్ సూర్యవంశీ దేశవాళీలోనూ అదరగొడుతున్నాడు. ప్రతిసారి తన తుఫాన్ ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచే వైభవ్ ఈసారి బంతితో మ్యాజిక్ చేశాడు. ఎడమ చేతివాటం స్పిన్నరైన అతడు.. నార్త్ ఈస్ట్ జోన్‌పై నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లతో ఔరా అనిపించాడు. బ్యాటుతో 8 పరుగులే చేసినా ఆ రెండు వికెట్లతో ఈస్ట్ జోన్ సెమీస్ చేరడంలో తనవంతు పాత్ర పోషించిన అతడు.. తాను బౌలింగ్ చేస్తాననే విషయం కెప్టెన్ ఇషాన్ కిషన్క తెలియదని చెప్పాడు.
𝐁𝐨𝐰𝐥 𝐢𝐭 𝐥𝐢𝐤𝐞 𝐕𝐚𝐢𝐛𝐡𝐚𝐯 𝐒𝐨𝐨𝐫𝐲𝐚𝐯𝐚𝐧𝐬𝐡𝐢 🎯
Meet the secret wicket-taker who enjoys bowling and answered his captain’s ‘risky’ call 🤙 – By @jigsactin#DuleepTrophy pic.twitter.com/ZhZ0QkeyZm
— BCCI Domestic (@BCCIdomestic) August 29, 2026
‘నార్త్ ఈస్ట్ జోన్‌తో మ్యాచ్‌లో నాకు బంతి అప్పగించి రిస్క్ తీసుకున్నానని ఇషాన్ భయ్యా అనుకున్నాడు. అయితే.. నేను వికెట్లు తీయగలననే సంగతి అతడికి తెలియదు. మీరు బ్యాటర్లను అడిగితే తాము బౌలింగ్‌ను ఆస్వాదిస్తామని చెబుతారు. ఓ బ్యాటర్ బౌలింగ్ చేయడం, ఓ బౌలర్ బ్యాటింగ్ చేయడం నిజంగా భలే అనిపిస్తుంది. ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లు వికెట్ ఇవ్వడం లేదు. దాంతో.. నాకో రెండు మూడు ఓవర్లు బౌలింగ్ ఇవ్వాలని ఇషాన్‌ను కోరా.

ఒకవేళ ఐదు వికెట్లు తీసినా సరే నాకు రెండు మూడుకు మించి ఓవర్లు ఇవ్వరని నాకు తెలుసు. అందుకని.. సాధ్యమైనంత మెరుగ్గా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించా. బ్యాటింగ్‌లో విఫలమైన నేను.. బంతితో రాణించి జట్టు విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని వైభవ్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ 210 పరుగులతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ బెర్తు కోసం ఆగస్టు 30, ఆదివారం నార్త్ జోన్‌తో ఇషాన్ సేన తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

