FIFA : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఇరాన్ ((Iran) జట్టుపై విధించిన రవాణా ఆంక్షలపై అమెరికా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. తమపై చూపిస్తున్న వివక్షను ఫిఫా దృష్టికి తీసుకెళ్తామని ఇరాన్ హెచ్చరించినా కూడా యూఎస్ఏ అధికారులు మాత్రం యూ టర్న్‌కు అవకాశమే లేదంటున్నారు. వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రూ గిలియని(Andrew Giuliani) మాట్లాడుతూ.. ఇరాన్‌పై ఆంక్షలను సమర్ధించుకున్నాడు. ఆ జట్టుకు లాజిస్టిక్ కష్టాలను తప్పించాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.
వరల్డ్‌కప్‌లో ఇరాన్ జట్టు తమ మ్యాచ్ అనంతరం అమెరికా వీడాలని అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో తమపై తీవ్రంగా వివక్ష చూపిస్తున్నారని ఇరాన్ కోచ్, కెప్టెన్ వాపోయారు. అమెరికా అధికారుల తీరుపై ఫిఫా యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు కూడా. అయినా సరే అమెరికా మాత్రం తమ నిర్ణయం సరైందేనని అంటోంది.

ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు వైట్ హౌస్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్రూ గిలియని ఇరాన్‌పై ఆంక్షలు కొనసాగుతాయని తేల్చేశాడు. ‘ఇరాన్‌పై ఆంక్షల విషయాన్ని సమీక్షిస్తున్నాం. ఆదివారం ఆ జట్టు చివరి లీగ్ మ్యాచ్‌కు లాజిస్టిక్ రవాణాపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉంది. మా వద్ద ఓ ప్లాన్ ఉంది. రేపు మధ్యాహ్నం బెల్జియంతో మ్యాచ్ అవ్వగానే ఇరాన్ బృందాన్ని అమెరికా అవతలకు తరలిస్తాం.
The chief of the White House World Cup taskforce says it’s “pretty amazing” Iran’s football team has been given visas for the tournament.
Andrew Giuliani defended the US’s treatment of the team, which has been forced to base itself in Mexico and fly in and out for matches. pic.twitter.com/TPkx4WH7kn
— Al Jazeera English (@AJEnglish) June 21, 2026
27 నిమిషాల్లో మెక్సికోలోని ఆ జట్టు శిక్షణ శిబిరం టిజువానాకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. టక్సాన్ నుంచి టిజువానాకు ఇరాన్ శిక్షణ కేంద్రాన్ని మార్చాడం మంచి నిర్ణయమే. ఇరాన్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది అందరికీ వీసాలు మంజూరు చేశాం. అయితే.. కొందరు మ్యాచ్ అధికారులకు వీసా అందలేదు. వారిపై కొన్ని ఆరోపణల కారణంగానే అమెరికాలోకి అనుమతించలేదు. ఇలా.. మేము ఇరాన్ జట్టు విషయంలో సమతూకాన్ని పాటిస్తున్నాం’ అని ఆండ్రూ పేర్కొన్నాడు.