Uganda: చరిత్ర సృష్టించిన ఉగాండా.. టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన పసికూన
Uganda: ఆఫ్రికా దేశం ఉగాండా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిదగిన సందర్భం. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్ - 2023 పోటీలలో ఆ జట్టు గురువారం రువాండాను ఓడించడంతో...
Uganda: ఆఫ్రికా దేశం ఉగాండా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిదగిన సందర్భం. అంచనాలను తలకిందులు చేస్తూ ఉగాండా క్రికెట్ జట్టు.. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్ – 2023 పోటీలలో ఆ జట్టు గురువారం రువాండాను ఓడించడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఐసీసీ మెగా టోర్నీలో ఉగాండా ఆడనుండటం ఇదే ప్రథమం.
ఆఫ్రికన్ రీజియన్ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఏడు దేశాలతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఇదివరకే నమీబియా ఆడిన ఐదు మ్యాచ్‌లకూ ఐదింటిని గెలుచుకుని పది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఉగాండా జట్టు ఆరు మ్యాచ్‌లలో ఏకంగా ఐదు గెలిచి పది పాయింట్లతో రెండో స్థానలో ఉంది. ఈ టోర్నీలో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్లు వరల్డ్ కప్‌కు క్వాలిఫై అవుతాయని ఇదివరకే ఐసీసీ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఉగాండా – రువాండాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రువాండా.. 18.5 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఎరిక్ దుసిన్ (19) టాప్ స్కోరర్. ఉగాండా బౌలర్లలో అల్పేష్ రంజానీ , దినేశ్ నక్రానీ, సెనెయోందొ , కెప్టెన్ మసాబా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యాన్ని ఉగాండా.. 8.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. నమీబియా, ఉగాండాలు క్వాలిఫై అవడంతో జింబాబ్వే, కెన్యా, నైజీరియా, టాంజానియా, రువాండాలు నిష్క్రమించాయి.
🚨 Uganda create history 🚨
They have qualified for the #T20WorldCup 2024 and will become only the fifth African nation to feature in the tournament 🔥
Details 👉 https://t.co/TgLrh9MBxw pic.twitter.com/yxMyyTMd4K
— ICC (@ICC) November 30, 2023
ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లుః
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, కెనడా (అమెరికా క్వాలిఫయర్), నేపాల్, ఓమన్ (ఆసియా క్వాలిఫయర్), పపువా న్యూ గినియా ((ఈస్ట్ ఆసియా పస్పిక్), ఐర్లాండ్, స్కాట్లాండ్ (యూరప్ క్వాలిఫయర్), నమీబియా, ఉగాండా (ఆఫ్రికా క్వాలిఫయర్) జట్లు అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో విండీస్, అమెరికాలు ఆడనున్నాయి.
Presenting the 2⃣0⃣ teams that will battle for ICC Men’s #T20WorldCup 2024 🏆
✍: https://t.co/9E00AzjcRN pic.twitter.com/1nu50LOLWQ
— ICC (@ICC) November 30, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

