R Praggnanandhaa: ఆనంద్‌ను దాటేసిన ప్రజ్ఞానంద.. ప్రశంసించిన గౌతమ్ అదానీ
Praggnanandhaa: చెస్ వరల్డ్ చాంపియన్ డింగ్ లీరెన్ను ప్రజ్ఞానంద ఓడించాడు. టాటా స్టీల్ టోర్నీలో అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. దీంతో ఇండియన్ నెంబర్ వన్ ర్యాంక్‌ను ప్రజ్ఞా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను మాజీ చాంపియన్ ఆనంద్‌ను దాటేశాడు. ప్రజ్ఞా విజయం పట్ల గర్వంగా ఉందని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద చరిత్ర(R Praggnanandhaa) సృష్టించాడు. టాటా చెస్ స్టీల్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ డింగ్ లీరెన్ను ఓడించిన ప్రజ్ఞానంద .. ఇండియన్ గ్రాండ్‌మాస్టర్ ర్యాంకుల్లో టాప్ ప్లేస్ కొట్టేశాడు. దీంతో అతను మాజీ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ను దాటేశాడు. లీరెన్పై విజయంతో ప్రజ్ఞానంద .. ఇండియన్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. బుధరవారం నాలుగవ రౌండ్లో వరల్డ్ చాంపియన్ డింగ్ లీరెన్ను ప్రజ్ఞానంద ఓడించాడు.
భారత నెంబర్ వన్ చెస్ ప్లేయర్‌గా ర్యాంక్ సాధించిన ప్రజ్ఞానందపై ప్రశంసలు కురుస్తున్నాయి. అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో చెస్ ప్లేయర్‌ను కీర్తించారు. ప్రజ్ఞా సాధించిన ఘనత పట్ల గర్వంగా ఉన్నట్లు తెలిపారు. వరల్డ్ చాంపియన్ డింగ్ లీరెన్ను ఓడించి, ఇండియన్ టాప్ ప్లేయర్ కావడం అద్భుతమని పేర్కొన్నారు. మన దేశానికి ఇది నిజంగా గర్వకారణమని అన్నారు.
Tremendously proud of your achievement, Pragg. What an astonishing moment, defeating the reigning World Champion Ding Liren of China and becoming India’s top-rated player. This is truly a proud moment for our nation! @rpraggnachess #TataSteelChess https://t.co/2ZSEbtZ9Ke
— Gautam Adani (@gautam_adani) January 17, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

