Simone Biles: బీమ్ ఫైనల్ లిస్టులో జిమ్నాస్ట్ బైల్స్..

టోక్యో: ఎట్టకేలకు మేటి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ( Simone Biles ).. టోక్యో ఒలింపిక్స్‌లో తన ట్యాలెంట్‌ను ప్రదర్శించనున్నది. మంగళవారం జరిగే బీమ్ ఫైనల్ ( Beam Final ) లో బైల్స్ పోటీపడనున్నది. అమెరికా అథ్లెట్ బైల్స్.. టోక్యోలో నాలుగు ఫైనల్స్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ట్విస్టీస్ కారణంగా ఆమె కొన్ని పోటీల నుంచి వైదొలిగింది. 24 ఏళ్ల అమెరికా జిమ్నాస్ట్ గత వారం .. వాల్ట్‌లో తన ట్యాలెంట్‌ను చూపించింది. కానీ ఆ తర్వాత మెంటల్ హెల్త్ కారణంగా ఇతర ఈవెంట్లకు దూరంగా నిలిచింది. నాలుగు సార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన జిమ్నాస్ట్ బైల్స్.. టోక్యోకు కూడా ఫెవరేట్ గా బరిలోకి దిగింది. అయితే 2016లో జరిగిన రియో క్రీడల్లో బీమ్ ఈవెంట్లో బైల్స్ బ్రాంజ్ గెలిచింది. ఆరు పతకాలు గెలవాలన్న లక్ష్యంతో బైల్స్ టోక్యోకు వచ్చినా అనారోగ్యం వల్ల ఆమెకు ఆ లక్ దక్కలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

