టోక్యో ఒలింపిక్ విలేజ్‌లో తొలి కరోనా కేసు..

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ఇంకా వారం రోజులే సమయం ఉంది. మరోవైపు కరోనా వైరస్ భయాందోళనలు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ టోక్యోలో ఉన్న ఒలింపిక్ విలేజ్‌లో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. వేలాది మంది అథ్లెట్లు పాల్గొన్న మహాక్రీడల్లో మహమ్మారి ఎలా విజృంభిస్తుందో అన్న భయం కూడా ఉంది. విలేజ్‌లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో.. తొలి కేసు బయటపడినట్లు టోక్యో నిర్వాహక కమిటీ ప్రతినిధి మాసా టకాయా తెలిపారు. గేమ్స్ నిర్వహణ కోసం విదేశాల నుంచి వచ్చిన ఓ విజిటర్‌కు వైరస్ సంక్రమించినట్లు టోక్యో 2020 సీఈవో తోషిరో ముటో తెలిపారు. ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవారో తెలియజేయలేదు.
ఇటీవల ఓ అథ్లెట్‌తో పాటు కొందరు ఒలింపిక్ సిబ్బందికి కరోనా వైరస్ సంక్రమించింది. జూలై 13, 14వ తేదీల్లో ఆరుగురికి కరోనా సోకినట్లు టోక్యో ఒలింపిక్స్ తన వెబ్సైట్లో పేర్కొన్నది. జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరిగే క్రీడల్లో.. ఒలింపిక్స్ విలేజ్‌లో సుమారు 11 వేల మంది అథ్లెట్లు బస చేయనున్నారు. బ్రెజిల్ ఒలింపిక్ బృందం ఉంటున్న హోటల్లోనూ భారీ సంఖ్యలో ఇటీవల పాజిటివ్ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

