అథ్లెట్లకు 1,50,000 కండోమ్‌లు పంపిణీ.. కానీ

టోక్యో : ఒలింపిక్స్ క్రీడలు టోక్యోలో జూలై 23వ తేదీన ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఆ మహావేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్ల కోసం సుమారు లక్షా 50 వేల కండోమ్‌లు పంపిణీ చేసేందుకు నిర్వహకులు సిద్ధం అయ్యారు. టోక్యోలోని ఒలింపిక్ విలేజ్‌లో బస చేసే అథ్లెట్లకు ఆ కండోమ్‌లను ఇవ్వనున్నారు. అయితే ఒలింపిక్ విలేజ్‌లో ఉన్న సమయంలో ఆ కండోమ్‌లను వాడవద్దు అంటూ నిర్వహకులు సూచనలు చేశారు. స్వదేశం తిరిగి వెళ్లే వరకు ఆ కండోమ్‌లను దాచుకోవాలని, తమతమ దేశాల్లో ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాలని ఒలింపిక్స్ నిర్వహకులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా వరకు కఠినతరమైన ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇక సోషల్ డిస్టాన్సింగ్ కూడా పాటిస్తున్నారు.
1988లో జరిగిన సియోల్ ఒలింపిక్స్ నుంచి అథ్లెట్లకు కండోమ్‌లను పంపిణీ చేస్తున్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో అథ్లెట్లకు కండోమ్‌లను ఇవ్వడం జరుగుతోంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లో హెచ్ఐవీ కేసులు పెరిగాయి. సింధు ప్రావిన్సులో కలుషిత సూదులు వాడడం వల్ల ఎక్కువ స్థాయిలో అక్కడ ఎయిడ్స్ కేసులు నమోదు అవుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇక టోక్యో గేమ్స్ సమయంలో అథ్లెట్లు దూరం పాటించాలని, భోజనం చేసే సమయంలోనూ ఎవరూ గుమ్మికూడవద్దు అని పేర్కొన్నారు. ఒంటరిగానే భోజనం చేయాలంటూ అథ్లెట్లకు సంకేతాలు ఇచ్చారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- AIDS
- Condoms
- HIV
- Tokyo athletes
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

